గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » "స్లమ్ డాగ్..."కు 8 ఆస్కార్ అవార్డులు
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
స్లమ్ డాక్ మిలియనీర్ చిత్ర బృందానికి మరువలేని రోజు. ఇప్పటి వరకూ స్లమ్ డాగ్ మిలియనీర్ మొత్తం 8 ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకుంది. భారతీయ నేపథ్యంలో రూపొందిన సంచలన చిత్రం "స్లమ్‌డాగ్ మిలియనీర్" సోమవారం లాస్‌ఏంజిల్స్‌లోని కొడాక్ థియేటర్‌లో అట్టహాసంగా జరిగిన ఆస్కార్ వేడుకలో ఎనిమిది విభాగాల్లో ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకుంది.

సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. దీంతో ఆస్కార్ గెలుచుకున్న తొలి భారతీయ సంగీత దర్శకుడిగా రెహ్మాన్ నిలిచాడు. బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్‌కుగానూ రెహ్మాన్‌కు రెండు ఆస్కార్లు లభించాయి. వీటితోపాటు బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్, ఉత్తమ గీతం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం విభాగాల్లో స్లమ్‌డాగ్ మిలయనీర్ చిత్రం ఆస్కార్ల పంట పండించుకుంది.

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: సైమోన్ బుఫాయ్
బెర్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: క్రిస్ డికెన్స్
బెస్ట్ సినిమాటోగ్రఫీ: ఆంథోనీ డాడ్ మాంట్లే
బెస్ట్ సౌండ్ మిక్సింగ్: రెసూల్ పూకుట్టీ
బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ స్కోర్: ఏఆర్ రెహమాన్
బెస్ట్ సాంగ్: ఏఆర్ రెహమాన్ (జైహో)
బెస్ట్ డైరెక్టర్: డేనీ బోయలే
బెస్ట్ మోషన్ పిక్చర్: స్లమ్‌డాగ్ మిలయనీర్
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: స్లమ్ డాగ్ మిలియనీర్ ఆస్కార్ అవార్డులు 8 ఆస్కార్