ప్రముఖ హాలీవుడ్ నటి కేట్ విన్స్లెట్ ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. "ద రీడర్" చిత్రంలో ఆమె నటనకు ఆస్కార్ పురస్కారం లభించింది. ఈ చిత్రంలో ఉత్తమ నటి అవార్డును కేట్ విన్స్‌లెట్ దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు డానీ రూపొందించిన ఈ చిత్రం కేట్ విన్స్‌లెట్ అద్భుతంగా నటించింది.
అవార్డు గెలుచుకున్న సందర్భంగా విన్స్‌లెట్ మాట్లాడుతూ.. ఆస్కార్ పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. ఈ అవార్డు దక్కేందుకు కారణమైన దర్శకుడు డానీకి, చిత్రయూనిట్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
తనను ఎంతగానో ఆదరించిన తల్లిదండ్రులు, సన్నిహితులు, అభిమానులు, స్నేహితులకు విన్స్‌లెట్ ఈ సందర్భంగా కేట్ కృతజ్ఞతలు తెలియజేసింది. విన్స్‌లెట్ అవార్డును కైవసం చేసుకున్న తరుణంలో కొడాక్ థియేటర్ అభిమానుల భారీ కరతాళ ధ్వనులతో మారు మోగింది.