గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » "స్లమ్‌డాగ్"కు గ్లోబల్ బాక్సాఫీస్ రికార్డు
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించి ఆస్కార్ అవార్డులను గెలుచుకున్ను"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం మరో రికార్డును సొంతం చేసుకుంది. దాదాపు 200 మిలియన్ డాలర్ల విలువగల అంతర్జాతీయ బాక్సాఫీస్ రికార్డును స్లమ్‌డాగ్ కైవసం చేసుకుంది. ఈ అంతర్జాతీయ బాక్సాఫీస్ రికార్డులో తన పేరును లిఖించుకున్న డానిబోయెల్ "స్లమ్‌డాగ్" చిత్రం.. ఇప్పటికే అవార్డుల పంట పండించిన సంగతి తెలిసిందే.

"కౌన్ బనేగా కరోడ్ పతి" ప్రత్యేక కార్యక్రమంలో ముంబైలోని పూరి గుడిసెలో నివసిస్తున్న ఓ బాలుడు రెండు కోట్ల రూపాయలను గెలుచుకునే కథను ఆధారంగా చేసుకుని చిత్రీకరించిన "స్లమ్‌డాగ్ మిలియనీర్" ఇప్పటికే.. 8 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సంగతి విదితమే.

ఉత్తమ చిత్రం, బెస్ట్ డైరక్టర్, ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్, ఫిల్మ్ ఎడిటింగ్, అద్భుతమైన స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రాఫీ, బెస్ట్ సౌండ్ మిక్సింగ్ వంటి విభాగాల్లో స్లమ్‌డాగ్ ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకున్న సంగతి విదితమే. ఇందులో "స్లమ్‌డాగ్"కు అద్భుతమైన సంగీతం అందించిన సముద్ర కెరటం ఎ.ఆర్. రెహ్మాన్‌కు మాత్రమే రెండు ఆస్కార్ అవార్డులు దక్కడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ స్లమ్డాగ్ మిలియనీర్ గ్లోబల్ బాక్సాఫీస్ రికార్డు డానిబోయెల్ 8 ఆస్కార్ అవార్డులు ఎఆర్ రెహ్మాన్