గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » హాలె బెర్రీ పెర్‌ఫ్యూమ్ వస్తుందోచ్..!
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
హాలీవుడ్ సెలబ్రిటీస్ బ్రిట్నీ స్పియర్స్, జెన్నీఫర్ లొపాజ్, సెలీన్ డియాన్, ఏంజెలీనా జోలీ సరసన హాలీవుడ్ సినీ తార హాలె బెర్రీ కూడా చేరింది. స్పియర్స్ వంటి పై తారలు మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లే తన సొంత బ్రాండ్‌లో హాలె పెర్‌ఫ్యూమ్‌ను విడుదల చేసింది.

సహజంగా సెలబ్రిటీలు అందరూ ఇష్టపడి వాడే సెంట్‌ను, తమ బ్రాండ్‌ పేరిట మార్కెట్లోకి విడుదల చేయడం పరిపాటి. ఇందులో భాగంగానే.. తాను కూడా తనకిష్టమైన సుగంధ ద్రవ్యాలతో తయారైన పర్‌ఫ్యూమ్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేశానని హాలె బెర్రి ఓ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

మిమోసా, చందనపు చెక్కలు, బ్లాసమ్స్, హిబిస్కస్ ఫ్లవర్స్‌లతో ఈ సెంట్‌ను తయారు చేశామని బెర్రి ఆ వెబ్‌సైట్‌లో చెప్పింది. సహజంగా, సున్నితంగా సువాసనను వెదజల్లే ఈ పెర్‌ఫ్యూమ్‌, ఇతరులను తప్పకుండా ఆకర్షించే రీతిలో ఉంటుందని బర్రి నమ్మకం వ్యక్తం చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ బెర్రీ పెర్ఫ్యూమ్ బ్రిట్నీ స్పియర్స్ జెన్నీఫర్ లొపాజ్ సెలీన్ డియాన్ ఏంజెలీనా జోలీ