ప్రముఖ పాప్ సంగీత రారాజు మైఖేల్ జాక్సన్ లండన్‌లో చివరి ప్రదర్శనను ఇవ్వనున్నాడు. గురువారం రాత్రి అకస్మాత్తుగా అభిమానులకు దర్శనమిచ్చిన మైఖేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అభిమానులంటే తనకెంతో ఇష్టమని, వారి కోసమే చివరి ప్రదర్శన ఇవ్వనున్నానని చెప్పాడు.
ఐదు నిమిషాల పాటు జాక్సన్ నిల్చున్న వేదిక అభిమానుల కరతాళధ్వనులతో మారుమ్రోగింది. తన అభిమానుల కోసమే చివరి షోను ఏర్పాటు చేశానని జాక్సన్ అన్నాడు.
జాక్సన్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన మరణశయ్యాగతుడైయ్యాడని ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జాక్సన్ ఆరోగ్యవంతంగా వేదికపై కనిపించిన దృశ్యం... ఇటీవల తలెత్తిన సందేహాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టింది.