గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » ఆస్కార్ విజేత హోర్టన్ పూటే మరణం
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
ప్రముఖ నాటక రచయిత, ఆస్కార్ అవార్డు విజేత హోర్టన్ పూటే మరణించారు. "టు కిల్ ఎ మాకింగ్ బర్డ్" చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించినందుకుగానూ ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు.

మరణించేనాటికి పూటేకు 92 సంవత్సరాలు. తన జీవితకాలంలో మొత్తం 50 నాటకాలు రచించిన ఆయన, 1962లో హార్పేర్ లీ నవల టు కిల్ ఎ మాకింగ్ బర్డ్‌కు ఆస్కార్ అవార్డు అందుకోవడం గమనార్హం.

మరణించేనాటికి కూడా ఓ నాటకాన్ని తెరకెక్కించేందుకు, పూటే ప్రొడక్షన్ పనులు నిర్వహిస్తున్నారని సీఎన్ఎన్ సైట్ పేర్కొంది. తన నివాసమైన లాస్ ఏంజెల్స్, పౌల్ మార్టే, కనెక్టికట్‌లో కన్నుమూశారని సీఎన్ఎన్ తెలిపింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర హాలీవుడ్ ఆస్కార్ విజేత హోర్టన్ పూటే మరణం టు కిల్ ఎ మాకింగ్ బర్డ్ స్క్రీన్ప్లే