గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » ప్రపంచ బాక్సాఫీస్ రికార్డులకు స్లమ్‌డాగ్ బ్రేక్
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
Slumdog Millionare
FileFILE
ఆస్కార్ అవార్డు చిత్రమైన స్లమ్‌డాగ్ మిలయనీర్ 200 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. దీంతో ప్రపంచ బాక్సాఫీసు రికార్డులను స్లమ్‌డాగ్ చిత్రం బ్రేక్ చేసింది. గత వారంలో చేసిన అంచనాల ప్రకారం, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీసు రికార్డుల్లో గతంలో రెండో స్థానంలో ఉండేది.

ఈ రికార్డుల్లో వార్నర్ బ్రదర్స్ రూపొందించిన ద క్యూరియెస్ కేస్ ఆఫ్ బెంజిమన్ బటన్ చిత్రానిది అగ్రస్థానం. అదలా ఉంచితే.. 18 ఏళ్ల పేద యువకుడు.. తన జీవన ప్రయాణంలో కోట్లకు పడగలేత్తుతాడు అనే అంశంపై రూపొందిన స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి మొత్తం పది కేటగిరీలకు గాను 8 ఆస్కార్ అవార్డులు వచ్చాయి.

అలాగే ఈ అవార్డుల్లో స్లమ్‌డాగ్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన డాన్నీ బోయెల్.. ఉత్తమ చిత్రం అవార్డును కూడా పొందాడు. అస్కార్‌లో అవార్డుల పంట పండించుకుని చరిత్ర సృష్టించిన స్లమ్‌డాగ్ ప్రస్తుతం ప్రపంచ బాక్సాఫీసు రికార్డులను కూడా బద్ధలు కొట్టడం విశేషమని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్ ప్రపంచం బాక్సాఫీస్ రికార్డులు స్లమ్డాగ్ మిలియనీర్ బ్రేక్ అవార్డులు వార్నర్ బ్రదర్స్