అవును.. అక్షరాలా 56వేల డాలర్లు ఖరీదు కట్టి ఆనిస్టన్ తన హెయిర్‌స్టైల్‌ను వైవిధ్యంగా చేయించుకుంది. త్వరలో జరుగనున్న మార్లే అండ్ మీ యూరప్ టూర్‌లో అందిరి కళ్లు తనవైపు ఉండేలా ఆనిస్టన్ ఈ వైవిధ్య హెయిర్‌స్టైల్‌ను చేయించుకుందట.
వారెన్ ట్రికోమీ సెలూన్ వ్యవస్థాపకుడైన ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఎడ్వార్డ్ ట్రికోమీ ఈ హెయిర్ స్టైల్ కోసం ప్రత్యేకించి కష్టపడ్డారుట. ఎడ్వార్డ్ మాట్లాడుతూ, ఇలాంటి హెయిర్‌స్టైల్ విలువకట్టలేనిదిగా తెలిపారు. ఈ హెయిర్‌స్టైల్ జా-డ్రాపింగ్ తరహాలాంటిదని ఆయన పేర్కొన్నారు.
ఓ మోడల్ స్టార్‌తో ప్రయాణించడానికి హెయిర్‌డ్రెస్సర్‌లు అనవసరంగా అధిక ఛార్జీలను వసూలు చేయరని, కానీ సెలూన్‌లో కోల్పోయిన దానిని తిరిగి మేకప్ చెయ్యాల్సిన అవసరమైతే ఉందని వివరించారు.