ప్రముఖ సౌందర్య సాధనాల ఉత్పత్తి సంస్థ "ఎస్టీ లాడర్"కు చెందిన ఓ ప్రకటనలో, "స్లమ్‌డాగ్ మిలియనీర్" హీరోయిన్ ఫ్రిడా ఫింటో నటించనుంది. ఎస్టీ లాడర్ కంపెనీకి ఫ్రిడాతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు కోటి రూపాయల విలువగల ఈ ఒప్పందం మేరకు లిజ్‌హార్లీ, గ్వైనెత్ పాల్‌త్రో కలిసి ఫ్రిడా ఓ ప్రకటనలో నటించనుందని ఎస్టీ లాడర్ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎనిమిది ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న "స్లమ్‌డాగ్" చిత్రానికి ఒకవైపు అవార్డుల పంట పండుతుంటే.. మరోవైపు ఆ చిత్రంలో నటించిన తారలకు సిరుల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో అందరినీ ఆకట్టుకున్న ఫ్రిడా పింటో ఎస్టీ లాడర్ ప్రకటనలో నటించే అవకాశం పొందిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందడం గమనార్హం.
ఇకపోతే.. ఎనిమిది ఆస్కార్ అవార్డులతో పాటు, బాప్టా, బ్రిటన్ అవార్డులతో కలిసి ఏడు అవార్డులు సొంతం చేసుకుంది. ముంబాయి మురికివాడ యువకుని ఇతివృత్తంతో బ్రిటిష్ దర్శకుడు డేనీ బోయల్ ఈ చిత్రం నిర్మించారు.
ఇప్పటి వరకు ఈ చిత్రం ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే (సైమన్ బ్యూఫోయ్), ఉత్తమ సినిమాటోగ్రఫీ ( ఆంటోనిడాడ్‌మాంటల్), బెస్ట్ సౌండ్ మిక్సింగ్ (రసూల్‌కుట్టి), బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ (క్రిస్ డికెన్స్), డేనీ బోయల్ (ఉత్తమ దర్శకుడు), ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఒకటి, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఎ.ఆర్ రెహ్మాన్‌కు రెండు ఆస్కార్డు అవార్డులు లభించాయి.