గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » ఐఐఎఫ్ఎ కార్యక్రమంలో ఐష్ డ్యాన్స్... డ్యాన్స్ (Aishwarya Rai | 10th IIFA awards | Macau | Kareena Kapoor | Shobana | Ravana)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
IFM
ప్రపంచ అందాల రాశి ఐశ్వర్యారాయ్ ఐఐఎఫ్ఎ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తన నృత్యాన్ని ప్రదర్శించనుంది. మకౌలో జూన్ 11న జరిగే అవార్డు ఉత్సవంలో ఐష్ తన నృత్యంతో వీక్షకులకు కనువిందు చేయనుంది. ఆమెతోపాటు కరీనా కపూర్ కూడా డ్యాన్స్ చేయనుంది.

ఇదిలావుంటే ఐశ్వర్యారాయ్‌కు అభినేత్రి శోభన నృత్య రీతులను నేర్పుతోందట. అభిషేక్ బచ్చన్, విక్రమ్ నటిస్తున్న మణిరత్నం చిత్రం రావణలో సీతగా నటిస్తున్న ఐష్‌ ఎలా డ్యాన్స్ చేస్తే బావుంటుందో కాస్త చెప్పమని దర్శకుడు మణిరత్నం ప్రత్యేకంగా శోభనను కోరారట. దీంతో శోభన రోజూ ఐష్‌కు క్లాసులు పీకుతోందట.

శోభన డ్యాన్స్ క్లాసులు ఎలా ఉన్నాయేంటీ... అని ఐష్‌ను కదిలిస్తే, పెదాలను బాగా సాగదీస్తూ తనదైన నవ్వులు చిందిస్తూ శోభన నాట్యం అద్భుతం. ఆమె చెప్పినట్లు చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫలితం వచ్చేదాకా శోభన ఎట్టి పరిస్థితుల్లో వదలదు. గురువుగారు ఓకే అనే వరకూ ఎగరాల్సిందే అని నవ్వుతూ చెప్పింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ఐశ్వర్యారాయ్, ఐఐఎఫ్ఎ అవార్డులు, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, విక్రమ్