గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » బందర్కర్ చిత్రంలో ఫ్రిడా పింటో? (Slumdog Millionaire| Freida Pinto| Madhur Bhandarkar)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మాధుర్ బందర్కర్ దర్శకత్వం వహించే చిత్రంలో, స్లమ్‌డాగ్ మిలియనీర్ హీరోయిన్ ఫ్రిడా పింటో నటించబోతుందని తెలిసింది. 8 ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న స్లమ్‌డాగ్ చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పింటోకు ఒకవైపు హాలీవుడ్ ఛాన్సులు వస్తుండగా, మరోవైపు బాలీవుడ్ ఛాన్సులు కూడా వెల్లువల్లా వస్తున్నాయి.

"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న ఫ్రిడా పింటోతో కొత్త సినిమా చేయాలని బందర్కర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఫ్రిడాతో పనిచేయడమంటే తనకెంతో ఇష్టమని, త్వరలో ఫ్రిడాతో కొత్త చిత్రాన్ని రూపొందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు బందర్కర్ వెల్లడించారు.

తన పదేళ్ల దర్శకత్వ శాఖలో ఎందరో ప్రతిభాశాలులైన నటులను చూశానని, కానీ ఫ్రిడా పింటోతో తీసే కొత్త సినిమా ద్వారా తనకు మంచి గుర్తింపు వస్తుందని బందర్కర్ తెలిపారు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా ఫ్రిడా కొత్త సినిమా ఉంటుందని బందర్కర్ అన్నారు. ఇంకేముంది..? త్వరలో ఈ ముంబై భామ ఫ్రిడా పింటో బాలీవుడ్‌లోనూ సంచలనం సృష్టించనుందన్నమాట..!.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: బాలీవుడ్, మాధుర్ బందర్కర్, స్లమ్డాగ్ మిలియనీర్, ఫ్రిడా పింటో