గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » హాలీవుడ్ చిత్రానికి రెహ్మాన్ సంగీతం (Hollywood, Cinema, Rehman, Music)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా యావత్ ప్రపంచాన్ని మైమరపించిన సంగీత యువ కెరటం ఎ.ఆర్. రెహ్మాన్ తొలిసారిగా ఒక హాలీవుడ్ చిత్రానికి సంగీతం దర్శకత్వం వహిస్తున్నారు.

అలీగఢ్ యూనివర్శిటీలో గౌరవ డాక్టరేట్ పొందిన అనంతరం రెహ్మాన్ మాట్లాడుతూ.. హలీవుడ్ నటుడు, దర్శకుడు పీటర్ బిల్లింగ్ స్లే రూపొందిస్తోన్న శృంగార హాస్యభరిత చిత్రం "కపుల్స్ రిట్రీట్"కు సంగీతాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదల కావొచ్చునని రెహ్మాన్ తెలిపారు. అమెరికా చలన చిత్ర పరిశ్రమలోకి తన నిజమైన అరంగేట్రంగా రెహ్మాన్ అభివర్ణించారు.

రెండు ఆస్కార్లు సాధించిన ఏకైక భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రెహ్మాన్ ఇంకా మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన శాంతియుత భారత్‌ను సృష్టించేందుకు యువత తీవ్రంగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్, సినిమా, రెహ్మాన్, సంగీతం, కపుల్స్ రిట్రీట్, స్లమ్డాగ్ మిలియనీర్, ఆస్కార్