గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » కొత్త ప్రాజెక్టుపై డానీ బోయెల్ దృష్టి? (Slumdog Millionaire| Danny Boyle| New Project)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
8 ఆస్కార్ అవార్డులు గెల్చుకున్న "స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన బ్రిటిష్ సినీ నిర్మాత డానీ బోయెల్ మరో కొత్త ప్రాజెక్టు కోసం ముంబైకి రానున్నారని తెలిసింది.

ముంబైకి చెందిన కథాంశంతో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాను మరో సినీ నిర్మాత అనురాగ్ కాశ్యప్‌తో కలిసి డానీ బోయెల్ నిర్మిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ప్రాజెక్టు వివరాలపై డానీ బోయెల్‌తో ఇంకా చర్చించాలని సినీ నిర్మాత అనురాగ్ కాశ్యప్ ఒక వార్తా సంస్థకు తెలిపారు.

ఇదిలా ఉంటే... 2009 సంవత్సరంలో బాలీవుడ్‌లో మంచి కలెక్షన్లు సాధిస్తాయని ఆశిస్తున్న వాటిలో అనురాగ్ తాజా సినిమా "దేవ్ డి" కూడా ఉంది. ట్రూ స్టోరీస్ పేరిట ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానెల్‌లో డాక్యుమెంటరీ సీరియల్‌ను కూడా అనురాగ్ రూపొందిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ ఈ నెల 12వ తేదీ నుంచి ప్రసారం కానుంది.

మరోవైపు.. డానీ బోయెల్ తదుపరి ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కాశ్యప్, బోయెల్‌లు కలిసి చేపట్టనున్న నూతన ప్రాజెక్టు తప్పకుండా విజయవంతమవుతుందని ఫిలిమ్ నగర్ పండితులు జోస్యం చెబుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కొత్త ప్రాజెక్టు, డానీ బోయెల్, ఆస్కార్, స్లమ్డాగ్ మిలియనీర్, ముంబై, అనురాగ్ కాశ్యప్