హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్‌ను పెళ్లాడేందుకు సెక్సీతార ఏంజెలినా జోలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంతకాలం తనతో పాటు సహజీవనం చేస్తున్న హాలీవుడ్ నటుడు బ్రాడ్‌పిట్ పెళ్లి చేసుకునేందుకు జోలీ సిద్ధమని ఆమె సన్నిహితులు తెలిపారు. తన మాజీ భార్య జెన్నిఫర్ ఎనిస్టన్‌తో బ్రాడ్ పిట్ మళ్ళీ సంబంధాలు కొనసాగిస్తున్నట్లు మీడియాలో ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో... ఏంజెలీనా జోలీ-బ్రాడ్‌పిట్‌ల సంబంధాలు తెగతెంపులయ్యే అవకాశముందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కోవడంతో జోలీ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది.
ఇంతవరకు తమ పెళ్లి విషయాన్ని బ్రాడ్‌పిట్ ఒక్కడే ప్రస్తావించే వాడు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు జోలీ కూడా ఈ విషయాన్ని ప్రతిపాదన చేయడం గమనార్హం. దీంతో ప్రస్తుతం వారిద్దరు అంగీకరించిన చిత్రాలు పూర్తయిన వెంటనే బ్రాడ్-జోలీల వివాహం వైభోగంగా జరుగనుందని సినీ వర్గాల సమాచారం.