ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ టాప్ లెస్ ఫోటోలు నెట్‌లో షికార్లు చేస్తున్నాయట. తన అందచందాలతో శ్రోతలను, ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న ఈ భామ, ప్రస్తుతం "సర్కస్" సంగీతయాత్రలో నిమగ్నమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రిట్నీ టాప్ లెస్ ఫోటోలు నెట్‌లో షికార్లు చేయడం విన్న ఆమె అభిమానులు నెట్ సెంటర్లవైపు పరుగులు తీస్తున్నారట. ఈ ఫోటోలు చాలా హాట్‌గా ఉన్నాయని హాలీవుడ్ వర్గాల సమాచారం.
ఇంకేముంది..? "సర్కస్" ఆల్బమ్ ఆవిష్కరణ కార్యక్రమంలో బ్రిట్నీ తన అందచందాలతో శ్రోతలను, ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుందనుకుంటే అంతకుముందే ఆమె అందాలు ఇలా నెట్‌లో షికార్లు చేయడం పట్ల ఆల్బమ్ నిర్వాహకులు పెదవి విరిచారట.
ఇప్పటికే "సర్కస్" ఆల్బమ్ నిర్వాహకులు బ్రిట్నీ స్పియర్‌లో పాత తేజాన్ని, వయ్యారాన్ని ఏమాత్రం ఒలికిపోకుండా, వేదికపైకి తేవాలని కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఆల్బమ్ విడుదల కార్యక్రమంలో... ఈ పాప్ సింగర్ బ్రిట్నీ కురచ దుస్తులతో వేదికపై కనిపించనుందని తెలిసింది.