పాప్ ప్రపంచపు రారాజు మైఖేల్ జాక్సన్ మరణ వార్త తన హృదయాన్ని కలచివేసిందని పాప్ స్టార్ మడోన్నా పేర్కొన్నది. జాక్సన్ భౌతికంగా లేకపోయినా తన మనసు ఎప్పుడూ మైఖేల్‌ను స్మరిస్తూనే ఉంటుందని చెప్పింది.
ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. అయితే మైఖేల్ తన సంగీతం రూపంలో ప్రతి ఒక్కరి మనసులో చిరస్మరిణీయులుగానే ఉంటారని మడోన్నా గద్గద స్వరంతో చెప్పింది. మైఖేల్ జాక్సన్ కుటుంబ సభ్యులకు మడోన్నా తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.