నల్ల సూరీడు నెల్సన్ మండేలా 91వ జన్మదినం సందర్భంగా ప్రాన్సు ప్రథమ మహిళ, మాజీ పాప్ సింగర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ సతీమణి కార్లా బ్రూనీ గొంతువిప్పారు.
భర్త అధికారంలో ఉన్నాళ్లూ గొంతు విప్పకూడదని శపథం చేసుకున్న కార్లాబ్రూనీ.. మండేలా జన్మదినోత్సవ సందర్భంగా శ్రోతలను, ప్రేక్షకులను తన గాత్రంతో మెప్పించారు.
తన పాటల్లో ప్రసిద్ధమైన "కెల్‌కూన్ మా డిట్" పాటను ఆహుతులకు వినిపించారు. గిటార్ పట్టుకుని నల్లటి స్విష్ ట్రౌజర్ సూట్ వేసుకున్న కార్లా.. ఈ సందర్భంగా రెండు డ్యూయెట్లు పాడారు. దీంతో న్యూయార్క్‌లోని రేడియో సిటీ మ్యూజిక్ హాలు ఆహుతుల చప్పట్లతో మారు మ్రోగింది.