ప్రధాన పేజివినోదం » వెండితెర » హాలివుడ్ » అమెరికాలో ఏంజిలీనా జోలీ నిలువెత్తు నగ్న విగ్రహం (Angelina Jolie | naked statue | actress breastfeeding | New York)
హాలీవుడ్ నటీమణులు నగ్నంగా నటించడం కొత్తేమీ కాదు. అయితే ఆ నటీమణుల తాలూకు నగ్న విగ్రహాలను ప్రతిష్టించడం మాత్రం కొత్త ప్రక్రియే. తాజాగా అమెరికాలోని ఓక్లహోమా సిటీలో ఏంజిలీనా జోలీ నిలువెత్తు నగ్న విగ్రహం త్వరలో అమెరికాలో దర్శనమివ్వబోతోంది.
కంచుతో తయారు చేస్తున్న ఏంజీలీనా నగ్న విగ్రహాన్ని శిశువుకు పాలిస్తున్నట్లుగా ఉంటుందట. న్యూయార్క్‌కు చెందిన డానియల్ ఎడ్వార్డ్ మాట్లాడుతూ, శిశువుగా పాలిస్తున్నట్లుగా తాను మలుస్తున్న ఏంజిలీనా నగ్న విగ్రహం తల్లుల్లో చైతన్యం తీసుకు వస్తుందని చెప్పాడు. ముఖ్యంగా చంటి పిల్లలకు తల్లిపాలు ఎంత ముఖ్యమో ఈ విగ్రహం తెలియజేస్తుంటున్నాడు.
కాగా గత ఏడాది ఏంజిలీనా తన ఇద్దరి కవలలకు పాలిస్తున్నప్పుడు తన బాయ్‌ఫ్రెండ్ బ్రాడ్ పిట్ ఫోటో తీశాడు. ఆ ఫోటో ఆధారంగా ఈ నగ్న విగ్రహాన్ని తయారు చేస్తున్నారు.