గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » వాల్ స్ట్రీట్ సీక్వెల్‌లో ఫ్రాంక్ లాంజెల్లా (Hollywood| US president Richard M Nixon| Frank Langella Wall Street)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
వివాదాస్పద అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ఎం నిక్సాన్ పాత్రలో నటించి మెప్పించిన ఫ్రాంక్ లాంజెల్లా ఇప్పుడు వాల్ స్ట్రీట్ సీక్వెల్‌లో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. "ఫ్రోస్ట్ నిక్సాన్"కు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా లభించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఫ్రాంక్ లాంజెల్లా "వాల్ స్ట్రీట్- 2: మనీ నెవర్ స్లీప్స్" చిత్రంలో నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వాల్ స్ట్రీట్ సీక్వెల్‌లో లెవీస్ జబెల్ పాత్రను ప్రాంక్ లాంజెల్లా (71) చేత చేయించాలని నిర్మాతలు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. వాల్ స్ట్రీట్- 2లో బాగా అనుభవజ్ఞుడైన స్టాక్ బ్రోకర్ పాత్ర పేరే లెవీస్ జబెల్.

మరో పెద్ద బ్రోకర్‌కు ఇతను సలహాదారుగా ఉంటాడు. ఈ పెద్ద బ్రోకర్ పాత్రను సినిమాలో "ట్రాన్స్‌ఫార్మర్స్" స్టార్ షియా లాబెవోఫ్ పోషిస్తున్నాడు. వాల్ స్ట్రీట్ సీక్వెల్ కోసం ఇప్పటికే నిర్మాతలు హాలీవుడ్ స్టార్ మైకెల్ డగ్లస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అకాడమీ విన్నర్ జోష్ బ్రోలిన్‌తోనూ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్, అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ఎం నిక్సాన్, ఫ్రాంక్ లాంజెల్లా, వాల్ స్ట్రీట్ సీక్వెల్