ఇటీవల 40 ఏళ్ల మార్కు దాటిన పాప్ గాయని జెన్నీఫర్ లోపెజ్ యవ్వనాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించడం లేదని తెలుస్తోంది. సాధారణంగా పాప్ గాయినీగాయకులు, హాలీవుడ్ హీరోయిన్లు, హీరోలు, ఇతర సెలెబ్రిటీలు తమ రూపం మారకుండా, నిత్య యవ్వనం తొణికిసలాడేందుకు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.
అయితే జెన్నీఫర్ లోపెజ్ కొంచెం వింతగా ప్రవర్తిస్తోంది. తన రూపం మారకుండా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించనని లోపెజ్ స్పష్టం చేసింది. ఇప్పుడే కాదు.. ఇకపై కూడా తాను ప్లాస్టిక్ సర్జరీ జోలికి వెళ్లనని తేల్చిచెప్పింది.
గాయని, నటీమణిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లోపెజ్ తాను ఎక్కువ సహజత్వానికే ప్రాధాన్యత ఇస్తానని చెప్పింది. కాస్మోటిక్ పద్దతుల జోలికి వెళ్లడం ఇష్టం లేదని లోపెజ్ చెప్పినట్లు "ఫిమేల్ ఫస్ట్" అనే మేగజైన్ పేర్కొంది.