ప్రముఖ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ తాజా ప్రియుడు ఆమెను వదిలేయాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు.. బ్రిట్నీని పెళ్లి చేసుకోవడం పట్ల ట్రావిక్ విముఖంగా ఉన్నట్లు ఫిమేల్ ఫస్ట్ వెబ్‌సైట్ వెల్లడించింది.
బ్రిట్నీని పెళ్లిచేసుకోవాల్సిందిగా స్పియర్స్ కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి వస్తోందని.. ఆ ఒత్తిడిని తాను భరించలేకపోతున్నానని జాసన్ ఆ వెబ్‌సైట్లో తెలిపినట్లు సమాచారం. తమకు ఓ బిడ్డ పుట్టాలని బ్రిట్నీ స్పియర్స్ కోరుకుంటోందని, కానీ ఆమె కోరికను తాను నిరాకరించానని జాసన్ ట్రావిక్ తెలిపాడు.
ఇకపోతే.. ట్రావిక్ సంగతులను చదివిన చాలామంది హాలీవుడ్ సినీ విశ్లేషకులు ఇక బ్రిట్నీ స్పియర్స్ మళ్లీ ఒంటరి కానుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రియుడు వదిలేయడంతో ఆమె మళ్లీ ఒంటరి జీవితానికి అలవాటు పడాల్సిందేనని వారు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తన ఏజెంట్ అయిన జాసన్ ట్రావిక్‌తో బ్రిట్నీ స్పియర్స్ చెట్టాపట్టాలేసుకుని తిరిగిందని హాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. అంతేగాకుండా ఏజెంట్‌తో బ్రిట్నీ క్లోజ్‌గా ఉండటం చూస్తే.. వారిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని బ్రిట్నీతో విడాకులు తీసుకున్న మాజీ భర్త కెవిన్ ఫెదర్‌లైన్ గతంలో చెప్పాడు. దీంతో పాటు.. బ్రిట్నీ-జాసన్‌లు డేటింగ్ కూడా చేస్తున్నారని పీపుల్స్ మ్యాగజైన్ తన ప్రచురణలో తెలిపింది.
ఈ నేపథ్యంలో బాయ్‌ఫ్రెండ్ వదిలేయడంతో ఒంటరి అయిన బ్రిట్నీకి మరో ప్రియుడు లభిస్తాడో? లేదో వేచి చూడాల్సిందే..!.