గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » జోలీతో ఇప్పట్లో జత కట్టేదిలేదు: బ్రాడ్ పిట్ (Hollywood | Brad Pitt | Angelina Jolie| Jennifer Aniston)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
Angelina Jolie
FILE
హాలీవుడ్ హాట్ జంట ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్‌లను ఒకే సినిమాలో మళ్లీ చూడాలనుకునే అభిమానులు నాలుగేళ్లుగా ఈ అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు.

ఇప్పటికీ ఈ జంట మరోసారి కన్నుల పండుగ చేస్తుందని ఎదురుచూస్తున్న అభిమానులు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అయితే ఇలా ఎదురుచూసే వారి ఆశలపై బ్రాడ్ పిట్ నీళ్లు చల్లాడు.

పెద్దతెరపై మా జంటను చూసే అవకాశం ఇప్పట్లో రాదని స్వయానా బ్రాడ్ పిట్ వెల్లడించాడు. కొత్త, సవాలుతో కూడిన కథ దొరికే వరకు తిరిగి తమ జంటను వెండితెరపై చూడలేరని పేర్కొన్నాడు.

2004లో వచ్చిన మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమాలో కలిసి నటించిన వీరు ఆ సందర్భంలోనే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి సహ జీవనం కూడా సాగిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్, బ్రాడ్పిట్, ఏంజెలీనా జోలీ, జెన్నిఫెర్ ఆనిస్టోన్, సినిమా