గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » సెప్టెంబర్ 3న మైఖేల్ జాక్సన్ ఖననం..? (Michael Jackson| September| Funeral| California| Pop King| Heart Attack)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
Michael Jackson
FILE
పాప్‌ కింగ్ మైఖేల్ జాక్సన్ భౌతికకాయాన్ని ఖననం చేసే కార్యక్రమాన్ని ఆయన కుటుంబీకులు మళ్లీ వాయిదా వేశారు.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ మూడో తేదీన జరుపనున్నట్లు జాక్సన్ కుటుంబ ప్రతినిధి కెన్ సన్ షైన్ వెల్లడించారు.

పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ 51వ పుట్టినరోజు ఆగస్టు 29న ఖననం చేస్తామని మైఖేల్ తండ్రి ఇటీవల చెప్పినా.. మళ్లీ ఈ కార్యక్రమాన్ని ఎందుకు వాయిదా వేశారో తెలియరాలేదు.

కానీ.. కాలిఫోర్నియాలోని గ్లెన్‌డేల్ ప్రాంతంలో గల ఫారెస్ట్ మెమోరియల్ పార్కులో ఉన్న గ్రేట్ మాసోలియమ్‌లో జాక్సన్ ఖననం ఉంటుందని తాజాగా తెలియవచ్చింది. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానిస్తున్నట్లు ఏస్‌షోబిజ్ పత్రిక తన ప్రచురణలో తెలిపింది.

ఇదిలా ఉండగా.. పాప్ సామ్రాజ్యాన్ని శాసించిన రారాజు మైఖేల్ జాక్సన్ జూన్ 26వ తేదీన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కొరియోగ్రాఫర్, నటుడు, డ్యాన్సర్‌గా ప్రపంచ ప్రజలను మైఖేల్ జాక్సన్ ఆకట్టుకున్న విషయం విదితమే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: మైఖేల్ జాక్సన్, సెప్టెంబర్, ఖననం, కాలిఫోర్నియా, పాప్ కింగ్, గుండెపోటు