పాప్ సంగీత ప్రపంచంలో రాణి.. మడోన్నా త్వరలో కోర్టు బోనులో నిలబడనున్నట్లు హాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇటీవల బల్గేరియాలోని ఓ స్టేడియంలో ఈ పాప్ రాణి సంగీత కచ్చేరీ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం సందర్భంగా స్టేడియం నాశనం అయిందట. ఈ పరిణామంతో.. స్టేడియం నిర్వాహకులు ఆగ్రహించారు.
ఈ స్టేడియంలో త్వరలో సాకర్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మడోన్నా కార్యక్రమం వల్ల స్టేడియం పాడవటంతో.. మైదానంలో ఇసుమంత గడ్డి లేకుండా పోయింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన స్టేడియం నిర్వాహకులు మడోన్నాపై దావా వేశారు.
స్టేడియం నిర్వాహకులకు స్థానిక ప్రభుత్వం కూడా మద్దతు తెలపడంతో.. త్వరలో మడోన్నా కోర్టు బోనులో నిలబడబోతోందని హాలీవుడ్‌లో వార్తుల ఊపందుకున్నాయి.