బిడియంతో ఓ డ్యూయెట్ పాటను కూడా రికార్డు చేయలేదు..!
FILE
పాప్ సామ్రాజ్యాన్ని శాసించిన పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్‌కున్న సిగ్గు, మొహమాటం, బిడయంతో ఆయనతో కలిసి ఓ డ్యూయెట్ పాటను కూడా రికార్డు చేయడం సాధ్యం కాలేదని పాప్ గాయని మడోన్నా తెలిపింది.
ఇటీవల జరిగిన ఎంటీవీ మ్యూజికల్ అవార్డుల సందర్భంగా తన పాతస్నేహితుడైన జాక్సన్‌కు మడోన్నా నివాళి అర్పించారు. ఈ సంగతులను సోమవారం టైమ్ పత్రికతో పంచుకున్నారు.
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ చాలా బిడియస్థుడని, అందువల్లే ఆయనతో కలిసి ఓ డ్యూయెట్ పాటను కూడా రికార్డు చేయడం సాధ్యం కాలేదని అన్నారు. ఇలాంటి వ్యక్తిపై పసిపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఎలాంటి ఆధారాలు లేకున్నా నీచమైనా ఆరోపణలు సాగించారని మడోన్నా విమర్శించారు. దీనికి తోడు అతనిని ఓ విచిత్రమైన వ్యక్తిగా పేర్కొంటూ మీడియాతో సహా అందరమూ అతన్ని దూరంగా ఉంచామనిమడోన్నా తెలిపారు.
తనకు జాక్సన్‌తో గల స్నేహాన్ని గురించి మడోన్నా వివరిస్తూ.. జాక్సన్‌తో కొన్ని వారాలపాటు పనిచేసే అవకాశం లభించిందని, తర్వాత స్నేహితులమైనా.. బిడియంతో ఆయనతో ఒక్క డ్యూయెట్ కూడా రికార్డ్ చేయలేకపోయామని మడోన్నా వెల్లడించింది.