ప్రముఖ పాప్ గాయని మడోన్నా మూడోసారి ముచ్చటగా పెళ్లికూతురు కాబోతోంది. తనకంటే 29 సంవత్సరాల జీసెస్ లజ్‌తో మడోన్నా ప్రేమాయణం కొనసాగిస్తోందని, అందుకే తన మాజీ భర్త గైరిచీకి విడాకులిచ్చిందని హాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. జీసెస్ లజ్‌ను వివాహమాడి తొమ్మిది నెలలుగా నెలకొన్న విమర్శలన్నింటికి మడోన్నా తెరదించనుందని డైలీ మెయిల్ తెలిపింది.
ఇదిలా ఉంటే.. మడొన్నా జీవిత చరిత్ర రాస్తున్న రాండీ టారా బొరెల్లీ హలో మ్యాగజైన్‌లో.. మడొన్నా- జీసెస్ లజ్‌ల ప్రేమాయణం గురించి వెల్లడించాడట. గత కొంత కాలంగా లజ్‌తో మడొన్నా డేటింగ్ చేస్తోందని, ఈ ఏడాది చివరికల్లా వాళ్ల వివాహం జరుగవచ్చునని రాండీ తెలిపినట్లు హలో మ్యాగజైన్ వెల్లడించింది.