జర్మనీ సూపర్ మోడల్ క్లాడియా షెఫెర్ క్యాట్ వాక్‌కు గుడ్ బై చెప్పేస్తానంటోంది. దాదాపు 20 ఏళ్ల పాటు మోడలింగ్‌లో తన క్యాట్‌వాక్‌తో ప్రేక్షకుల మదిని దోచిన క్లాడియా ఇక మోడలింగ్ చేసేది లేదని స్పష్టం చేసింది.
అంతేకాదు.. నటీమణిగా కొనసాగుతూ.. నవోమి క్యాంప్‌బెల్ వంటి తారల్లా మోడలింగ్ చేసి వారి బాటలో నడిచేందుకు తాను సిద్ధంగా లేనని క్లాడియా తేల్చిచెప్పేసింది.
39 సంవత్సరాల క్లాడియా మోడలింగ్‌ను వదులుకోవాలనుకుంటున్నట్లు కాంటాక్ట్ మ్యూజిక్ పత్రిక తన ప్రచురణలో పేర్కొంది. ఇంకా మోడలింగ్ రంగంలో ఎంతో ఎంజాయ్ చేశానని, అయితే ఇప్పటికి క్యాట్‌వాక్‌కు స్వస్తి చెప్పాలని క్లాడియా భావిస్తున్నట్లు ఆ పత్రిక తెలిపింది.