గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » ఆనిస్టన్‌ను ఎందుకు కలుసుకున్నానో తెలుసా..?: బ్రాడ్‌ పిట్ (Brad Pitt| Hollywood| Jennifer Aniston| Angelina Jolie)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
Jennifer Aniston
FILE
హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్ తన మాజీ భార్య, సెక్సీతార జెన్నీఫర్ ఆనిస్టన్‌ను రహస్యంగా కలుసుకుంటున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. అయితే ఏంజెలీనా జోలీతో తనకున్న సంబంధాన్ని గురించి జెన్నీతో చర్చించేందుకే ఆమెను కలుసుకున్నట్లు బ్రాడ్ పిట్ గ్రాజియా మ్యాగజైన్‌కు తెలిపాడు.

గత 2005లో జెన్నీఫర్‌తో తన వివాహ సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్న బ్రాడ్‌పిట్.. తాజాగా న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో ఒక గంటపాటు ఆనిస్టన్‌తో గడిపాడని గ్రాజియా మ్యాగజైన్ తన ప్రచురణలో వెల్లడించింది. ఈ విషయంపై బ్రాడ్ పిట్ స్పందిస్తూ.. ఆనిస్టన్‌తో తనకున్న సంబంధంపై తన భార్య, హాలీవుడ్ తార ఏంజెలీనాతో తనకు వివాదాలు తలెత్తున్నాయని చెప్పాడు. ఈ అంశంపై మాట్లాడేందుకు మాత్రమే ఆనిస్టన్‌ను కలిశానని బ్రాడ్ పిట్ దాటవేశాడు.

ఇకపోతే.. ఆనిస్టన్‌తో తిరిగి సంబంధాలు కొనసాగించడం మంచిదికాదని బ్రాడ్ పిట్ తల్లి జేన్ సూచించినట్లు హాలీవుడ్ వర్గాల సమాచారం. ఆనిస్టన్‌తో కలిసి తిరగడం వల్ల బ్రాడ్‌పిట్-జోలీల మధ్య సమస్యలు తలెత్తుతున్నాయని, దీంతో బెర్లిన్‌కు బ్రాడ్‌ పిట్ మకాం మార్చనున్నట్లు తెలిసింది. ఇప్పటికే బ్రాడ్‌పిట్-జోలీ దంపతులకు మాడొక్స్, పాక్స్ జహారా, షిలో, వివిని, నాక్స్ అనే ఆరుగురు సంతానం ఉన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: హాలీవుడ్, బ్రాడ్పిట్, జెన్నీఫర్ ఆనిస్టన్, ఏంజెలీనా జోలీ