గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » తెలుగు వెండితెరపై కొలంబియా వారి "ది గ్రడ్జ్" (The Grudge | Colambia Pictures | Spider man | Horror film)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
WD
అత్యున్నత సాంకేతిక విలువలతో కొలంబియా పిక్చర్స్ నిర్మించిన హార్రర్ మూవీ "ది గ్రడ్జ్". ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన "స్పైడర్ మేన్" చిత్రానికి దర్శకత్వం వహించిన సరా మైఖేల్ గిల్లార్ ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం.

హార్రర్ పిక్చర్స్‌లోనే ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చి అందరి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అమెరికాలో 110 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని విక్టరీ ఫిలిమ్స్ టి.దుర్గారావు సమర్పణలో "ది గ్రడ్జ్ క్షుద్రనిలయం" పేరుతో ఆర్.ప్రసాద్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 54 ప్రింట్లతో నవంబర్ మూడోవారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ది గ్రడ్జ్ గురించి చిత్ర సమర్పకుడు టి దుర్గారావు తెలియజేస్తూ... "ఓ ఇంట్లో కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో ఆ యువతి దెయ్యమై తిరుగుతోందన్న ప్రచారంతో ఆ ఇంట్లోకి ఎవరూ రారు. ఈ విషయం తెలీని ఓ బృందం అదే ఇంటిని అద్దెకు తీసుకుంటారు. అక్కడి నుంచి ఆ బృందానికి కష్టాలు మొదలవుతాయి.

ఆ బృందంలోని ఒక్కొక్కరూ హత్యకు గురవుతారు. అదే బృందంలో ఉన్న హీరోయిన్ ఈ మిస్టరీని ఎలా ఛేదిస్తుందనేది ప్రధాని ఇతివృత్తం. ఈ కథను ఎంతో నైపుణ్యంతో డైరెక్టర్ సరా మైఖేల్ గిల్లార్ తెరకెక్కించారు. ఆయన ఇంతకుముందే డైరెక్ట్ చేసిన స్పైడర్ మాన్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే.

ది గ్రడ్జ్ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో రూపొందించడం జరిగింది. అమెరికాలో కొలంబియా ద్వారా విడుదలైన ఈ చిత్రం 110 మిలియన్ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇంత చక్కని చిత్రాన్ని తమ బ్యానర్‌లో తెలుగు ప్రేక్షకులకు అందించడం చాలా ఆనందంగా ఉంది. మాటల రచయిత వెన్నెలకంటి చాలా అద్భుతమైన మాటలు రాశారు.

స్టార్టింగ్ టు ఎడిటింగ్ ఎంతో ఉత్కంఠతో సాగే ఈ చిత్రం తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం నాకు ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నవంబర్ మూడోవారంలో 54 ప్రింట్లతో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: వెన్నెలకంటి, సమర్పణ: విక్టరీ ఫిలిమ్స్ టి.దుర్గారావు, నిర్మాత: ఆర్.ప్రసాద్ రాజు, దర్శకత్వం: సరా మైఖేల్ గిల్లార్
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ది గ్రడ్జ్, కొలంబియా పిక్చర్స్, స్పైడర్ మేన్