గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » హాలివుడ్ » "స్లమ్‌డాగ్ మిలియనీర్"ను వెంటాడుతోన్న అవార్డులు (Slumdog Millionaire| Danny Boyle| Dev Patel| Freida Pinto| Oscar| Bafta| Golden Globe| European Awards)
హాలివుడ్
Feedback Print Bookmark and Share
 
FILE
ప్రముఖ దర్శకుడు డానీ బోయెల్ రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం "స్లమ్‌డాగ్ మిలియనీర్". ఇప్పటికే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రతిష్టాత్మక యురోపియన్ ఫిల్మ్ అవార్డ్‌కు చెందిన ఐదు కేటగిరీల్లో నామినేట్ అయింది.

ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత, ఉత్తమ కెమెరామెన్ వంటి తదితర విభాగాల్లో స్లమ్‌డాగ్ మిలియనీర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. జాక్వెస్ ఆడియార్డ్ సినిమా "ఎ ప్రోఫెట్" స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి ఈ ఐదు కేటగిరీల్లో గట్టిపోటీనివ్వనుంది. ఈ సినిమా యురోపియన్ ఫిల్మ్ అవార్డ్స్ లోనే అత్యధికంగా ఆరు విభాగాల్లో నామినేట్ కావడం గమనార్హం.

ఇకపోతే.. జర్మనీలోని బోకమ్‌లో డిసెంబర్ 12న యురోపియన్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో.. ఉత్తమ నటి అవార్డుకు బ్రోకెన్ ఎంబ్రాసెస్ సినిమాలో పోషించిన పాత్రకుగాను సెక్సీస్టార్ పెనలర్ క్రూజ్ నామినేట్ కాగా, ఈమెకు పోటీగా టైటానిక్ ముద్దుగుమ్మ కేట్ విన్‌స్లెట్ చార్లెట్టో జెయిన్స్‌బర్గ్ ఉన్నారు.

ఇదిలా ఉంటే.. ముంబై మురికి వాడల్లో చిన్నారుల జీవనం, వారిలో నిగూఢమైన ప్రతిభను అత్యంత హృద్యంగా తెరపై ఆవిష్కరించిన స్లమ్‌డాగ్ మిలియనీర్ సినిమా.. నాలుగు గోల్డెన్ గ్లోబ్, ఎనిమిది ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. అలాగే 10 ఆస్కార్ నామినేషన్లనూ, 11 బాఫ్టా ( బ్రిటీష్ అకాడమీ ఫిలిం అవార్డు) నామినేషన్లనూ సంపాదించగలిగింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: స్లమ్డాగ్ మిలియనీర్, డానీ బోయెల్, దేవ్ పటేల్, ఫ్రిడా పింటో, ఆస్కార్, బాప్టా, గోల్డెన్ గ్లోబ్, యురోపియన్ అవార్డ్స్