ప్రధాన పేజివినోదం » వెండితెర » హాలివుడ్ » మైఖేల్ జాక్సన్‌కు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు (Michel Jackson| Hollywood| American Music Awards| Pop king| Taylor Swift)
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినా.. ఆయన ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో విహరిస్తునే ఉంది.
ఆదివారం రాత్రి లాస్ ఏంజెలిస్‌లోని నోకియా థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన అమెరికన్ మ్యూజిక్ అవార్డుల్లో నాలుగు విభాగాల్లో అవార్డులు నెగ్గి.. సంగీత ప్రపంచంలో తానింకా బతికే ఉన్నానని మైఖేల్ చాటుకున్నారు. మైఖేల్ జాక్సన్ తరపున ఆయన సోదరుడు జర్మైన్ జాక్సన్ అవార్డులను అందుకున్నాడు.
ఇకపోతే.. మైఖేల్ జాక్సన్‌ను యువ సంచలనం టేలర్ స్విఫ్ట్ అధిగమించింది. జాక్సన్‌ను టేలర్ అధిగమించి "ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్"తో పాటు ఏకంగా ఐదు విభాగాల్లో విజేతగా నిలిచింది.