1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

న్యూస్ రీడర్ అయ్యేదాన్ని : పూజనమ్ బజ్వా

న్యూస్ రీడర్ అయ్యేదాన్ని : పూజనమ్ బజ్వా
నేను చేసిన కొద్ది సినిమాలయినా బాస్‌లో చేసిన పాత్ర మరవలేను. నాగార్జున నుంచి చాలా నేర్చుకున్నాను. నటిగా ఇంకా చేయాల్సింది చాలా ఉందని పూనమ్ బజ్వా అంటోంది. మొదటి సినిమా‌తో తెలుగు తెరకు పరిచయం అయిన పూనమ్ తాజాగా రాజా నటించిన వేడుక చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా గురువారం హైదరాబాద్ వచ్చిన ఆమెతో కాసేపు మాటామంతి....

ప్ర : ఈ రంగంలోకి రావాలని ఎలా అనిపించింది?
జ : సినిమా, మీడియా అనేవి కీలకమైన భాగాలు. నేను పూనెలో బి.ఎ. లిటరేచర్ చదివేరోజుల్లో వక్తృపు పోటీల్లో పాల్గొనేదాన్ని. అందరూ నా వాయిస్ బాగుంటుందని న్యూస్‌రీడర్‌గా పనికొస్తావని చెప్పేవారు. ఆ ప్రయత్నాలు చేస్తుండగానే అనుకోకుండా వెంకట్ అనేదర్శకుడు తను తీయబోతున్న మొదటి సినిమా చిత్రంలో కథానాయికకోసం ప్రయత్నిస్తున్నానని న్ను సంప్రదించారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని స్నేహితుల సలహామేరకు అంగీకరించాను.

ప్ర : ఈ రంగంలోకి రాకపోయివుంటే ?
జ : ఇంకేముంది. న్యూస్‌రీడర్‌గా వుండేదాన్ని. ఎందుకంటే న్యూస్‌రీడర్ కూడా వార్తలు తగిన విధంగా స్పందించాలి. అన్ని వార్తలు నవ్వుతూ చదవలేంకదా...

ప్ర : వేదుక చిత్రం ఎలాంటి అనుభూతినిచ్చింది?
జ : ఈ చిత్రం థియేటర్లలో స్పందన బాగానే ఉంది. నటిగా గుర్తింపు ఇచ్చింది. విజయవంతమయిన చిత్రంలో నటించాననే తృప్తినిచ్చింది.

ప్ర : రాజాతో కలిసి నటించడం ఎలా అనిపించింది?
జ : ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. సెట్లో చాలా జోవియల్‌గా ఉంటారు. మొదటి సినిమా హీరో నవదీప్ తన కెరీర్‌కు ప్రాధాన్యత ఇస్తాడు.

ప్ర : ప్రేమ గురించి నీ అభిప్రాయం?
జ : ఇంతవరకు పడలేదు. దాని గురించి తెలీదు.
ప్ర : పెళ్ళి విషయంలో?
జ : పెద్దలు నిర్ణయించినా, ప్రేమించినా అతను ఆరడగుల ఎత్తు ఉన్నాడనికాదు. మంచి మనస్సున్న వ్యక్తిత్వంగల వ్యక్తినే కోరుకుంటాను. అయినా దానికి చాలా టైమ్ ఉంది.

ప్ర : నాగార్జునతో బాస్ చిత్రంలో చేయడంలో మీరెలా ఫీలవుతున్నారు?
జ : నాగార్జున నటించడం చాలా గొప్పగా ఫీలయ్యాను. నా రెండో సినిమానే ఆయనతో నటించాను. ఆయన గుడ్ హ్యూమన్ బీయింగ్.

ప్ర : మీకు నచ్చిన నటీనటులెవరు? మీ ఫేవరేట్ హీరో ఎవరు?
జ : ఫేవరేట్ హీరో సైఫీ అలీఖాన్. ఆర్టిస్టుగా నసీరుద్దీన్‌షా. హీరోయిన్లు షబనా ఆజ్మీ, టబు.

ప్ర : ఎక్స్‌పోజింగ్ పాత్రలపై మీ ఫీలింగ్?
జ : ఎక్స్‌పోజింగ్ ప్రత్యేకంగా చేయాలనే దానికి వ్యతిరేకిని. కథాపరంగా వచ్చే ఎలాంటి పాత్రనైనా చేస్తా.

ప్ర : మీ లక్ష్యం ?
జ : మంచి పాత్రలు వేసి నటిగా గుర్తింపు పొందాలనేది.

ప్ర : ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
జ : తమిళంలో జీవా హీరోగా నటిస్తోన్న చిత్రంలో చేస్తున్నారు. 8 నుంచి ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాను.
About Writer
WD