భాషరాకపోయినా భావయుక్తంగా నటిస్తేచాలని నమ్మే నటీమణులు ఉన్నట్లే పట్టుబట్టి భాషనేర్చుకుని పాత్రకు మరింత న్యాయం చేయాలనుకునేవారూ ఉన్నారు. వారిలో నటి షీలాను పేర్కొనవచ్చు. చెన్నైలో పుట్టి పెరిగి ఊహతెలీనప్పుడే నటిగా అవతారం ఎత్తిన షీలా, ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో బిజీ నటిగా మారింది. మొదట్లో నటనంటే ఏమిటో ఆమెకు తెలియదు. వచ్చిన పాత్రలను చేసుకుంటూ మరోవైపు చదువుకుంటూ ఎలాగో ట్వల్త్ పూర్తి చేశాను. ఇక సినిమా అవకాశాలు రావడంతో చదువును కాస్త పక్కకుపెట్టి "సీతాకోక చిలుక" గా మారింది. "రాజుభయ్యా"తో మరో అడుగు వేసినా అనుకున్న మెట్లు ఎక్కలేకపోయింది. అందుకే యాంకర్‌గా అవతారమెత్తి "హలో ప్రేమిస్తారా!" అంటూ ముందుకు వస్తోంది. షీలాతో ముఖాముఖీ...
ప్రశ్న: మీ కుటుంబంలో ఎవరైనా నటనారంగంలో ఉన్నారా? ఎవరూ లేరు. పుట్టి పెరిగింది చెన్నై. నాన్నది కెనరా బ్యాంక్ ఉద్యోగం. అమ్మది ఇంటి ఉద్యోగం, అదేనండి...గృహిణి. ఓ తమ్ముడున్నాడు. క్యాజువల్‌గా ఇడంస్ట్రీలోకి వచ్చాను. చిన్నప్పుడే...అంటే 2వ సంవత్సరంలోనే "నదియా" అనే చిత్రంలో నటించా. చదువుకుంటూ మోడలింగ్ వైపు వెళ్ళాను, ట్వెల్త్ కంప్లీట్ అయింది.
ప్ర: మీతోటి వాళ్ళు సరదాగా కాలేజీ లైఫ్ ఎంజాయ్‌చేస్తుంటే మీరిలా...? కాలేజీ లైఫ్ వర్ణించలేనిది. వాళ్ళను చూస్తున్న కాసేపు ఎటువంటి లైఫ్ కోల్పోయావు అనిపిస్తుంది. సినిమాల్లో అటువంటి క్యారెక్టర్ వచ్చినా కొంతవరకే పరిమితం, అందుకే అప్పుడప్పుడు నా స్నేహితుల్ని ఫోన్‌చేసి కబుర్లు చెపుతూ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు నటిగా వృత్తిధర్మం నెరవేర్చాలి. అందుకే దీనికే ప్రాధాన్యత ఇస్తాను.
ప్ర: 'సీతాకొక చిలుక' ఎలా అయ్యారు? ఓ తమిళ మేగజైన్‌లో నా ఫోటోలు చూసిన రాజరాజన్ అనే దర్శకుడు నన్ను సంప్రదించారు. టైటిల్‌తో పాటు.. కథ కూడా నచ్చడంతో అంగీకరించాను.
|