1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

ఏడిపించే సీన్...టైసన్ పాత్రంటే ఇష్టం: శేఖర్ కమ్ముల

ఏడిపించే సీన్...టైసన్ పాత్రంటే ఇష్టం శేఖర్ కమ్ముల
WD PhotoWD
కాలేజీ సినిమా అనగానే స్టూడెంట్స్ లెక్చరర్స్‌ను ఏడిపించడం, ద్వంద్వార్థాలతో డైలాగ్‌లు, బఫూన్లగా చూపించడం, యువతల మిడ్డీలు, గౌన్‌లు వేసుకుని కాలేజీలకు రావడం అనేది.. గత నుంచి వస్తున్న ఆనవాయితీ. రియల్‌లైఫ్‌లో జరగని విషయాలను కాలేజీలో చూపిస్తూ తల్లిదండ్రులకు కాలేజీ పంపించాలంటే భయపడే రోజులు ఒకప్పుడు.

ప్రస్తుతం సినిమాల తీరు మారింది. దీనికి ఎవరో ఒకరో నడుం కట్టాలి. అందుకే కాలేజీ అంటే దేవాలయం, అసభ్యతలేకుండా మన కుటుంబంతో చూసేట్లుగా సినిమాలు తీయాలని మొదటి నుంచి మనస్సులో ఉన్న కోరికను నేను బయటపెట్టానని గర్వంగా చెబుతున్నాడు... శేఖర్ కమ్ముల.

"డాలర్ డ్రీమ్స్" అనే చిత్రాన్ని తీసినప్పుడు ఈయనెవరో తెలియదు. అది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో అతను మన తెలుగువాడే అని ఇండస్ట్రీ గుర్తించింది. అందుకే తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించాలని "ఆనంద్" తీసినా విడుదల తర్వాత కాస్త భయమేసింది. అప్పుడు "శంకర్‌దాదా ఎం.బి.బి.ఎస్"కు పోటీగా అంతా కొత్తవారితో రిలీజ్ చేశాడు. రిలీజ్ తర్వాత వచ్చిన స్పందన చూసి ఇండస్ట్రీ ఆయన ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది.

ఆ తర్వాత 'గోదావరి" అంటూ అలనాటి ఎన్. ఎన్. ఆర్ నటించిన "అందాలరాముడు"ను మార్చి తీసి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం తన సొంతగా అంతా కొత్తవారితో "హ్యాపీడేస్" అనే చిత్రాన్ని తీసి చిరంజీవి కొడుకు "చిరుత" పోటీగా రిలీజ్ చేశాడు. మళ్ళీ సక్సెస్ సాధించాడు. కాకపోతే సినిమాను అమ్మేశాడు. అయినా తన పని అయిపోయిందనుకోకుండా థియేటర్ రిపోర్ట్స్‌ను పర్యవేక్షిస్తునే ఉన్నాడు. ఈ సందర్భంగా బుధవారంనాడు క్రాస్‌రోడ్డ్‌లోని దేవీ థియేటర్‌లోకి వచ్చిన శేఖర్‌ కమ్ములతో జరిపిన మాటామంతీ....

ప్రశ్న: "హ్యాపీడేస్" డ్రీమ్ ప్రాజెక్టు అని చాలాసార్లు చెప్పారు... కానీ దాన్ని అమ్మేయడానికి కారణం?
జ: నేను ఊహించినంతగా వ్యాపారం జరిగింది. "దిల్" రాజు నా సినిమాపై ఉన్న నమ్మకంతో ఆయనే కొనుగోలు చేశారు. పైగా ఆయనకు పబ్లిసిటీ చేయడం బాగా తెలుసు.

ప్రశ్న: పదికోట్లకు అమ్మారంటున్నారు?
జ: అదేంలేదు. పదిలోపే. వసూళ్ళపరంగా మీరన్నంత రావచ్చు.

ప్రశ్న: ఈ సినిమా విజయం పట్ల మీరెలా ఫీలవుతున్నారు?
జ: ఈ సక్సెస్ విస్తృతమైన అప్లాజ్ వస్తుందని ఊహించలేదు. ఈ సినిమా తర్వాత నేను ఏ సినిమా అయినా చెయ్యగలను... అనే నమ్మకం కలిగింది. యాక్షన్ కూడ చేయగలను. యాక్షన్ పట్టుకుంటే స్పెక్టాకలర్‌గా ఉంటుంది. అలాగే సెంటిమెంట్, లవ్ ఏదైనా చేయగలను. ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో చాలామంది మెచ్చుకున్నారు. దానికి పొంగిపోలేదు.

ప్రశ్న: తర్వాత చిత్రానికి రేటు పెంచుతారా?
జ: నా దృష్టిలో దర్శకుడు అనేవాడు 5,6 సినిమాల వరకు రేటు పెంచకూడదు. ఒక్క సినిమాకే పారితోషికాన్ని పెంచేయడం నాకు నచ్చదు. రెండో సినిమాకు పేరు పాడు చేసుకుంటే ఇమేజ్ పోతుంది. నా మటుకు నేను మంచి సినిమా తీయాలనే గోల్ ఏర్పరుచుకున్నాను.

ప్రశ్న: మీరే స్వంతంగా చిత్రాలు తీయడానికి కారణం?
జ: గోదావరి సినిమా ఉంది. పడవమీద అలా వెళుతుండడమే సినిమా అంటే డబ్బు పెట్టేవాడికి నచ్చదు. కన్‌వీన్స్ చేయలేం. నాకు వేరే ఆలోచనలు ఉంటాయి. నాతో సమానంగా ఆలోచించినవారితో తీస్తాను. ఇక కాలేజీ సినిమా... 9మంది ఉంటారు. అంతా కొత్తవారే. అంటే ఏ నిర్మాత ముందుకురాదు. నా విజన్ నాకుంది. నేను నిర్మాతను ఒప్పించలేకపోవచ్చు. అలాగే తొలిసినిమా "ఆనంద్". ఒక అమ్మాయి ఉంటుంది. పొద్దునే కాఫీ తాగుతుంది. ఆమె తన పెండ్లి చెడగొట్టుకుంటుంది. ఓ కుర్రాడువస్తాడు. అద్దెకుంటాడు... ఇలా చెబితే నిర్మాత కన్వీనెన్స్ కాలేడు. అందుకే స్వయంగా నేనే తీశాను. ఆర్థికంగా స్థిరపడ్డాను. అవసరమైతే స్నేహితులు హెల్ఫ్ చేస్తారు.
ప్రశ్న: క్యాంపస్ కథలు ఇంతకు ముందు ఇలాలేకపోవడానికి కారణమేమంటారు?
జ: లాస్ట్ 20 సంవత్సరాలు ఏ కాలేజీ సినిమా తీసుకున్నా వేరేవిధంహా ఉండేవి. ఇలా పాజిటివ్‌గా ఉండాలనే ఎవ్వరూ ఆలోచించలేదు. అదేమంటే అలా తీయకపోతే యూత్ సినిమాలు చూడరు అనేవారు. సమాజానికి మేలు చేయకపోయినా చెడు చేయడం అనే అవగాహన ఉంటే ఎప్పుడో తీసేవాళ్ళు. అంతా కొత్తవారయినా నా సినిమాకు పెద్ద సినిమా అంత ఖర్చయింది. కాలేజీ ఫ్రీ అయినా, కాస్ట్యూమ్స్ ఫ్రీ, అయినా ఎందుకు ఖర్చయిందంటే నా విజన్ బట్టి గ్రాండ్‌గా సినిమా తీయాలని... అది సినిమా చూస్తే తప్పకుండా అర్థమవుతుంది.

ప్రశ్న: మీకు బాగా హత్తుకున్న కేరక్టర్ ఏది?
జ: ఎప్పుడూ ఏడిపించేసీన్ టైసన్ పాత్ర. తన స్నేహితుని భవిష్యత్త్ కోసం తనకి వచ్చిన సీటును వదిలేస్తాడు. అతను అమ్మాయి ప్రేమిస్తే... ఆ అమ్మాయి మంచిది కాదు. కెరీర్‌పాడవుతుందనే ఆలోచించే పాత్ర... వాడికిలేనిది నీకెందుకురా? అని స్నేహితులు అంటే ఎంతైనా మనఫ్రెండ్ గదరా? అనే డైలాగ్ ఎమోషనల్‌గా కదిలించివేసింది. టీచర్ పాత్రలో కమలిని ముఖర్జీ వెంటకుర్రాడు పడడం చూపించినా... చివర్లో ఆమె ఇచ్చిన బుక్స్‌లోని కొటేషన్స్ కుర్రాడి లైఫ్‌కు టర్నింగ్ పాయింట్. అదీ చాలా బాగుంది.

ప్రశ్న: సక్సెస్ కారణం ఎవరు?
జ: లైట్‌బాయ్ నుంచి ప్రతీ టెక్నీషియన్స్ కారకులు. ఏ సినిమాలో చేసినా వారు ఎలా ఉంటారో తెలీదుగానీ. నా సినిమా మటుకు బాగా ఆడాలని చాలామంది టెక్నీషియన్స్ గుళ్ళకు వెళ్ళి మొక్కుకున్నారు. నా మీద అభిమానంతో చేశారు. అంతా దేవుడి దయ.

ప్రశ్న: తర్వాత చిత్రం ఎలా ఉంటుంది?
జ: ఆలోచిస్తున్నాను. ఏ కథ అవసరమో మనసుకు తట్టలేదు. సడెన్‌గా తట్టినప్పుడు తెరపై పడితే ఎలా ఉంటుందో ఆలోచిస్తాను. నాకు స్టార్స్, ఫైనాన్స్ ప్రాబ్లమ్ లేదు. నేను చేసే సినిమాలు లైబ్రరీలో పెట్టుకునేవిధంగా ఉండాలన్నదే నా ఆశ. అలాంటి సినిమాలే తీస్తాను.

ప్రశ్న: నా సినిమాలు చూడకపోతే ఇక సినిమాలు చేయనని ఆ మధ్య ఆవేశంగా సక్సెస్ మీట్‌లో అన్నారు?
జ: నలుగురు చూసే, మెచ్చే సినిమాలు తీయాలని వచ్చాను. చూసేకొద్ది మొహమొద్దిద్ది అనే చందంగా... నా సినిమాలు చూసి చూసి విసుగుపుట్టింది అన్నపుడు నేను సినిమాలు చేయనన్నాను. అంటే అది దర్శకుడిగా మాత్రమే. అంతేగానీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాననే అర్థం కాదు. కథారచయితగా, నిర్మాతగా మారి చిత్రాలు తీస్తాను. వేరే దర్శకుడిని పెట్టుకుంటాను. ఎవరికైనా 5,10 సంవత్సరాలు మంచి రేంజ్‌లో ఉంటుంది. ఎల్లకాలం అదే రేంజ్ ఉండదు గదా... రేపు ఏం జరుగుతుందో చెప్పలేను. భవిష్యత్తులో నా కంటే బాగా తీసే దర్శకులు రావచ్చు.
About Writer
Selvi