1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలి: ప్రిన్స్ మహేష్

తండ్రి నుంచి నటవారసునిగా తెలుగు వెండి తెర ప్రవేశం చేసిన మహేష్ బాబు.. అంచలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ఇమేజ్‌ను
తండ్రి నుంచి నటవారసునిగా తెలుగు వెండి తెర ప్రవేశం చేసిన మహేష్ బాబు.. అంచలంచెలుగా ఎదిగి తనకంటూ ఓ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. భవిష్యత్ అంతా తమ యూత్ హీరోలదేననీ, తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడానికి తనవంతు కృషి చేస్తానని ఈ ప్రిన్స్ అంటున్నారు. అయితే. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో మాత్రం నటించనని అంటున్నారు.

థమ్స్ అప్ అంబాసిడర్ వల్ల ఫ్యాన్స్ మరింత దగ్గరయ్యారని, ఇందుకుగాను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. తన చిత్రాలకు వచ్చే టైటిల్స్ అన్నీ మూడు అక్షరాలతో రావడం సెంటిమెంట్ కాదనీ, అంతా యాదృశ్చికమేనని చెపుతున్న మహేష్ బాబు (భార్య పేరు నమ్రత, కొడుకు గౌతమ్ కూడా మూడు అక్షరాల పేర్లే) హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

ప్ర.. అతిథి ఆర్థికంగా లాభించిందా? సక్సెస్ అనుకుంటే ఎలా ఫీలవుతున్నారు?
మొదటి వారం కలెక్షన్స్ రిపోర్ట్స్ చూశా. ఊహించిన దానికంటే.. ఎక్కువగా వచ్చాయి. ఇదంతా నాన్నగారి అభిమానుల వల్లే. విపరీతంగా ఓపెనింగ్స్ దక్కాయి. అందువల్లే ఆర్థికంగా లాభించింది.

ప్ర.. వరుసగా యాక్షన్ సినిమాలే చేయడానికి కారణం.?
ముఖ్యంగా బడ్జెట్. దానివల్లే యాక్షన్ చిత్రాలు చేయాల్సి వస్తోంది. చిత్రాల్లో యాక్షన్‌తో పాటు.. సెంటిమెంట్ ఉంటేనే బిజినెస్ అవుతుంది. యాక్షన్ చిత్రాల్లో ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పొటన్షియాలిటీ కూడా యాక్షన్ చిత్రాల ద్వారానే వచ్చింది.

ప్ర.. మీతో జేమ్స్‌బాండ్ చిత్రం చేయాలని దర్శకుడు సురేందర్ రెడ్డి అంటున్నారు. దీనిపై మీ కామెంట్?
ఇపుడిపుడే తెలుగు సినిమా ఎదుగుతోంది. ఇప్పుడున్న స్టైల్, ట్రెండ్‌కు అపుడే జేమ్స్ బాండ్ చిత్రాలు చేయలేను. దానికి కొంత టైమ్ పడుతుంది.
ప్ర... తెలుగు చిత్రాల్లో క్వాలిటీ లోపించిందని తెలుగు విమర్శకుల అభిప్రాయం దీనిపై మీ అభిప్రాయం.?
క్వాలిటీ పరంగా హిందీ తర్వాత తెలుగు సినిమానే. తమిళం బాగా వెనుకబడివుంది. ఒక్కడు, పోకిరి వంటి చిత్రాలను వాళ్లు రిమేక్ చేశారంటే.. మనదగ్గరే మంచి క్వాలిటీ ఉందనేగా అర్థం.

ప్ర..ఇతర భాషల్లో నటించే అవకాశం ఏమైనా ఉందా?
లేదు. వచ్చినా నేను వెళ్లను. తెలుగు సినిమాను మరింత ఉన్నత స్థాయిలో చూడాలని వుంది. ఆ దిశగా మా యువతరం హీరోలంతా కృషి చేస్తాం. అందుకే నేను ఏడాదికి ఒక సినిమానే చేస్తాను.

ప్ర... ఏడాదికి ఒకటే చేయడానికి మరేదైనా కారణం ఉందా?
క్వాలిటీ పరంగా, టెక్నికల్ పరంగా సినిమా బాగా తీయాలంటే ఏడాది పడుతుంది. సినిమా పూర్తవ్వడానికే ఆరేడు నెలలు పడుతుంది. దానికి ముందు మూడు నెలలు స్క్రిప్ట్ స్డడీ చేయాలి. సినిమా పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇలా అంతా పూర్తయ్యేసరికి ఏడాది పడుతుంది. 30 రోజుల్లోనూ సినిమా చేయగలను. కానీ దాన్ని ఎంత బాగా తీశామన్నదే పాయింట్.

ప్ర... ఆధ్యాత్మిక చిత్రాలవైపు దృష్టిసారించలేదా?
అటువంటి చిత్రాలు నేను చేయలేను. నా బాడీ సూట్ కాదు. ఒకవేళ సూట్ అని ఎవరైనా అనుకున్నా నేను అలా చేయలేను.

ప్ర... రిమేక్‌ల మీద మీ అభిప్రాయం.?
అదే హీరోలా చేయాలా? అలాగే నడవాలా? అనిపిస్తుంది. అందుకే వాటిపై పెద్దగా దృష్టి పెట్టను. నా స్టైల్ నాది.

ప్ర.. శేఖర్ కమ్ములతో సినిమా చేస్తున్నారని తెలిసింది నిజమేనా?
ఆయనతో పని చేయడమంటే చాలా ఇష్టం. ఆయన గత చిత్రాల గురించి బాగా తెలుసు. హ్యాపీడేస్ ఇంకా చూడలేదు. మంచి అభిరుచివున్న దర్శకుడు.
About Writer
PNR