ఎంత మంది వచ్చినా నాకు పోటీ లేదు: గజాలా
|
చిత్ర సీమకు ఇంత కాలం దూరమవ్వడానికి కారణం?
అలాంటిదేం లేదు... తమిళంలో బాగా బిజీ అయ్యాను... వెన్నడాచలమ్, రామ్ తదితర తమిళ చిత్రాల్లో నటించాను. అనుకోకుండా
శివకాశిలో నటించాలని పిలుపు వచ్చింది... దాంతో..
అప్పట్లో శివకాశి షూటింగ్ మీ కారణంగా లేట్ అయ్యిందని అంటున్నారు.. మరి?
నిజానిజాలెలా ఉన్నా గతాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు..
గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేశారు.. ఎందుకో తెలుసుకోవచ్చా...?
ఈ సంఘటన జరిగి దాదాపు నాలుగేళ్లు పైగా అయ్యింది. అదీ గాక దానికి గల కారణాలను నేను అప్పట్లోనే వివరించాను. మళ్లీ ఇప్పుడు దాని గురించి ప్రస్తావించకండి.
ఎవరితోనైనా ప్రేమలో పడ్డారా...?
అదేం లేదండి... నేను మా అమ్మ, నాన్నలను తప్ప మరెవరినీ ఇంతవరకు ప్రేమించలేదు. అదీ గాక నాకా ఫీలింగ్ ఇంతవరకు కలగలేదు.
భద్రాద్రిలో మీ పాత్ర?
భద్రాద్రిలో నాది పూర్తిగా మోడ్రన్ గాల్‌ను పోలి రౌడీ పిల్లలా కనిపిస్తాను. అయితే ఇది వైవిధ్యంగా ఉంటుంది. అంటే మొదటి హాఫ్‌లో ఒక రకమైన పాత్ర అలాగే రెండో హాఫ్‌లో మరొక రకమైన పాత్రలో నేను కనబడతాను.
ఎక్స్‌పోజింగ్ పాత్రలకు అనుమతిస్తున్నారా..?
ఎక్స్‌పోజింగ్ పాత్రలలో కాకపోయినా గ్లామరస్‌గా కనిపించే పాత్రలలో మాత్రమే అనుమతిస్తాను.
కొత్త చిత్రాలు ఏవైనా చేస్తున్నారా...?
ప్రస్తుతానికి భద్రాద్రి తప్ప ఇంకేవీ లేవండి... ఇక ముందు రావచ్చు....
గ్లామర్ పాత్రలను ఎక్కువగా పోషించిన మీరు మరి భద్రాద్రిలో కూడా... అలాంటిదేనా..?
ఎస్... నాకు ప్రస్తుతం అలాంటి పాత్రలే ఎక్కువగా వస్తున్నాయండి. అయితే అల్లరి రాముడు చిత్రంలో విలేజ్ అమ్మాయిగా నటించిన నాకు ఎంతో మంచి పేరు వచ్చింది. అలాంటి తరహా పాత్ర భద్రాద్రి చిత్రంలోను మరో కోణంలో కనపడుతుంది.
ప్రస్తుతం చిత్ర సీమలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది.. మీరు ఎలా ఫీలవుతున్నారు?
నాకేం ఫర్వాలేదు.. ఎందుకంటే నేను చిత్ర సీమలో అడుగుపెట్టి దాదాపు ఏడేళ్ల అయ్యింది. నాకెలాంటి పాత్రలనివ్వాలో ఇండస్ట్రీకి తెలుసు. కాబట్టి ఎంత మంది వచ్చినా నాకెలాంటి పోటీ లేదు.
ఎక్కువగా మీరు మస్కట్ వెళుతుంటారని వినికిడి.. ఎందుకు వెళ్తారో తెలుసుకోవచ్చా?
వెళ్తాను... కాని మా తల్లి, దండ్రులు కోసం అక్కడికి వెళ్తుంటాను. వాళ్లతో ఎక్కువసమయం గడపాలనే ఉద్దేశ్యంతో నాకు వీలుచిక్కినప్పుడల్లా వెళ్లి వస్తుంటాను. ఐతే కొద్ది రోజులు మాత్రమే అక్కడ గడుపుతాను.
