స్క్రిప్ట్ ఉంటే మల్టీ స్టారర్ చిత్రాలకు సిద్ధమే: విక్టరీ
|
డిసెంబర్ 13న వెంకటేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ.... ముందుగా
తులసీ చిత్రం నుంచి చిత్రాల టైటిల్స్‌లో మహిళా ప్రాధాన్యత కలిగిన టైటిల్స్ పెట్టారు.. కారణం..?
కథా పరంగా వచ్చిన టైటిల్స్‌ను దర్శక, నిర్మాతలు నా దృష్టిటి తీసుకురాగా అవి నాకది బాగుంది అనిపిస్తే ఆ టైటిల్‌నే ఖరారు చేస్తాం.. అయితే మల్లీశ్వరి నుంచి నేటి తులసి టైటిల్స్ వరకు వినడానికే కాక, మహిళలకు సంబంధించిన అంశాలు ఉన్నాయన్న ఉద్దేశ్యంతోనే ఆ టైటిల్స్ పెట్టామే గాని.. అందులో ప్రత్యేకత లేదు..
తులసీ చిత్రంలో వాయ్‌లెన్స్ ఎక్కువయిందని విమర్శలు వస్తున్నాయి.. మరి మీరేమంటారు..?
గత చిత్రాల్లో యాక్షన్ అంశాలు పెద్దగా లేనందువల్ల ఈ చిత్రాన్ని చూసి అలా అనిపించి ఉండవచ్చు.. మరో విశేషమేమిటంటే తులసీ కంటే మరింత ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలు మరింతగా ఉండాలని అభిమానులు కోరుతున్నారు..
అయితే మీ తర్వాత చిత్రం కూడా యాక్షన్ ప్రధానాంశంగా చేయనున్నారా...?
అలా అని ఏం లేదు... ప్రస్తుతం కథలను వింటున్నాను.. చివరకు ఏది ఖరారవుతుందో చెప్పలేం.. బాడీ లాంగ్వేజ్ తగ్గ సబ్జెక్ట్ దొరకాలిగా.. అలాంటి సబ్జెక్ట్ వచ్చిందంటే యాక్షన్ అనే కాదు.. ఎంటర్టైన్మెంట్, డ్రామా, సెంటిమెంట్ అంశాలు గల చిత్రాలైనా ఫర్వాలేదు..
శేఖర్ కమ్ములతో ఓ చిత్రం చేయనున్నారని విన్నాం..?
యస్... అయితే అది ఇంకా స్క్రప్ట్ దశలోనే ఉంది... కమ్ముల హ్యాపీడేస్ చిత్రం నాకు చాలా బాగా నచ్చింది... ఎంతో ఫీల్ అయ్యాను కూడా... అది చూశాక ఆ చిత్రం యూనిట్‌కు అభినందనలు తెలపాను.
వరుసగా రెండు చిత్రాల విజయాల పట్ల మీ ఫీలింగ్..?
సంతోషంగా ఉంది.. గత ఏడాది నా పుట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు వచ్చిన రెండు సినిమాలు విజయవంతమైయ్యాయి.. అయితే ఈ విజయాన్ని కొద్ది రోజులకు మరచి పోతాను... ఎందుకంటే అభిమానులు నా నుంచి మరింత బిగ్ హిట్‌ను కోరుకుంటారు కాబట్టి.
గణేష్ వంటి చిత్రాలు తీయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.. మీరేమంటారు..?
నిజమే... కాని అలాంటి సబ్జెక్ట్ తయారు చేసుకోవడం కష్టం... అయితే తాము అలాంటి స్క్రిప్ట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం.. మరో విషయమేమిటంటే మనకు కథలు తక్కువ.. కథా రచయితలూ తక్కువే..
మీ అబ్బాయిని మీలాగే బాల నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం చేసే అవకాశం ఉందా..?
నేను బాల నటుడిని కాదు.. స్కూల్‌లో చదువుకుంటుంటే పిలిస్తే వెళ్లా.. అంతే కాని నాకు నటన గురించి తెలియదు.. అయితే మా వాడు ఇంకా పెద్దవ్వాలి. అయినా వాడిష్టం.. తెలుగు చిత్రాలు చేస్తాడో.. లేక హాలీవుడ్‌లో చేస్తాడో.. అసలు నటుడు కావాలనుకుంటున్నాడో లేదో.. చెప్పలేం..
మల్టీస్టారర్ చిత్రాలు చేయాలని గతంలో అన్నారు... ఎప్పుడు తీయాలనుకుంటున్నారు..?
అవును నిజమే.. అయితే దానికి తగ్గ కథ కుదరాలి.. అంతే కాక బడ్జెట్ సహకరించాలి.. అలాగే అలాంటి సినిమా చేయాలంటే ఎన్నో అంశాలు కలిసి రావాలిగా.. అయితే అన్నీ కలగలిపి స్క్రిప్ట్ సిద్ధంగా ఉంటే చేసేందుకు నేనుసిద్ధమే.. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో 25 మంది హీరోలున్నారు.. నిర్మాతలకు వారితోనే సమయం సరిపోవట్లేదు..
పరిశ్రమలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది.. మీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉందా..?
నాకు అలాంటి తరహా చిత్రాలు చేయాలనే ఉంది.. క్షణక్షణం, బొబ్బిలి రాజా, ఘర్షణ వంటి చిత్రాలు చేయడానికి నేను ఇష్టపడతాను.. దానికి తగ్గ కథ వస్తే చేయడానికి సిద్ధం...
బుల్లి తెరపైకి వచ్చే ఆలోచన ఉందా...?
చేస్తా.. కాని నేను చిత్రాల నుంచి రిటైర్డ్ అయిన తర్వాత...
క్రికెట్‌పై మీ కామెంట్..?
అనిల్ కుంబ్లే వంటి సీనియర్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయం సరైనది... ప్రస్తుతం మన టీం ఇండియా జట్టు బాగానే అడుతోంది.. అందుకే మార్చిలో ఆస్ట్రేలియాలో జరిగే టెస్ట్ క్రికెట్ సిరీస్‌ను చూసేందుకు వెళ్తున్నా..
