టీవీ సీరియల్స్‌లో నటిస్తే తప్పా..?: నాగార్జున
గురువారం, 20 డిసెంబర్ 2007( 16:09 IST )
మీ చిత్రాలన్నీ డిసెంబర్‌లోనే విడుదలయ్యాయి.. అలాంటి సెంటిమెంట్ ఏదైనా..?
అందరూ సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటుంటారు... అయితే మూడు వారాల పాటు హాలిడేస్ వస్తుంది కనుక ముందుగా డిసెంబర్‌లో విడుదల చేస్తే దాని ప్రభావం సంక్రాంత్రి వరకు ఉంటుందని మా ఉద్దేశ్యం. చిత్రం యావరేజ్ అయినా కలెక్షన్లు బావుంటాయని మా అభిప్రాయం.
ఇలాంటి చిత్రాలు కాకుండా... గదర్, రంగ్‌దే బసంతి వంటి చిత్రాలు చేస్తున్నారా..?
గదర్, రంగ్‌దే బసంతి వంటి చిత్రాలు గొప్ప చిత్రాలు..నాకు అలాంటి చిత్రాలు చేయాలనుంది. అయితే దానికి తగ్గ స్క్రిప్ట్ దొరికితే చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
కృష్ణార్జునలో నటిస్తున్నారు కదా.. అందులో మీ పాత్ర..?
కృష్ణుడి పాత్ర... బాగా నచ్చింది... కృష్ణార్జునలో సినిమా అంతా కనిపిస్తాను కూడా...
శేఖర్ కమ్ములతో చిత్రం చేయనున్నట్ల వార్తలు వస్తున్నాయి..?
త్వరలో చేయాలని అనుకుంటున్నాం.. మా బేనర్‌లోనే చేస్తాం...
కార్పరేట్ సంస్థలు నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నందున అన్నపూర్ణ స్టూడియోస్‌ను ఆ దిశగా తీసుకెళ్లే ఆలోచన ఏదైనా ఉందా..?
తీసుకురాకపోతే వెనకబడిపోతాం... అందుకే కదా.. యువసీరియల్‌ను ప్రారంభించాం..
మీరు సీరియల్స్‌లో నటిస్తున్నారా...?
సీరియల్స్‌లో నటిస్తే తప్పా..? సినిమాలు లేక నాగార్జున సీరియల్స్‌లో నటిస్తున్నాడని నేను అనుకోను... అయినా.. ఇప్పుడు వెండి తెర కన్నా.. బుల్లి తెరపై ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వచ్చు.
మీ తనయుడు చైతన్య తెరంగేట్రం ఎప్పుడు...?
వాడికీ మధ్యే 22 ఏళ్లు పూర్తయ్యాయి... వస్తాడు.. కాని వాడు ఇది చేస్తాడు.. అది చేస్తాడు అని చెబితే థ్రిల్‌గా ఉండదు...