ప్రధాన పేజి   వినోదం > వెండితెర > ముఖాముఖి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
స్టార్ కావాలంటే మాస్ ముద్ర పడాల్సిందే: సుమంత్
Sumanth
WD PhotoWD
ప్రేమకథ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన హీరో.. సుమంత్. ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తొలిరోజుల్లో అపజయాలనెదుర్కొన్నప్పటికీ.. సత్యం చిత్రంతో ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. అంతేగాక ఆ తర్వాత యాక్షన్ మిలితమైన చిత్రాల్లో, మాస్ చిత్రాల్లోను నటించి మంచి హీరోగా గుర్తింపు పొందాడు.

చిత్రాల ద్వారా ప్రజలకు సందేశం అందించకపోయినా దాని వల్ల అభిమానులకు సంతోషమే తప్ప చెడును అందజేయకూడదన్నది తన అభిమతం అని ఆయన చెబుతారు. ప్రస్తుతం పౌరుడు చిత్రంలో నటిస్తున్న సుమంత్‌తో సాగించిన ఇంటర్వ్యూ...

ఈ చిత్రానికి కొత్త దర్శకుడినే ఎందుకు ఎన్నుకున్నారు..?
దర్శకుడు రాజ్ ఆదిత్య కొత్త అతను అయినప్పటికీ.. ఆ విభాగంలో ప్రియదర్శన్ వద్ద పనిచేసిన అపార అనుభవం ఉంది. ఇంక కొత్త పాత ఏముంది. రాజ్ తొలిసారి మా సిస్టర్‌కు కథ చెప్పాడు. చాలా మంది తమిళ దర్శకులు కథ చెబుతుంటే అర్థం కాదు. కానీ రాజ్ తొలిసారి కథను ఇంగ్లీషులో చెప్పాడు. ఆ తర్వాత తెలుగు నేర్చుకుని వచ్చి మళ్లీ చెప్పాడు. తొడకొట్టడం, విజిల్ వేయడం నా బాడీకి సరిపడదు. అతను చెప్పిన కథలో తండ్రీ, కొడుకు, హీరో, హీరోయిన్ సీన్స్ కొత్తగా అనిపించాయి. ఈ కథను తాతయ్యకు భోజనం చేస్తుండగా చెప్పాను. బాగుంది అన్నారు. మామయ్య కూడా ఓకే అన్నాకే సినిమా రెడీ చేశాం.

ఈ చిత్రానికి మీ సిస్టర్ నిర్మాతగా పనిచేయడానికి కారణం..?
ఆహా చిత్రం నుంచి సుప్రియ (సుమంత్ సిస్టర్) చాలా చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేసింది. అక్కకు నిర్మాతగా అనుభవముంది. సత్యం తర్వాత దాదాపు 4 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాము. అంత గ్యాప్ ఉండకూడదనుకుని ఇక నుంచి ఏడాదికి ఒక సినిమా చేయాలనుకుంటున్నాను. నాకు హీరోగా చేయడం ఎంత ఇష్టమో.. అలాగే నిర్మాతగా చేయడం కూడా అంతే ఇష్టం.

దీని అర్థం బయట సినిమాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయా..?
ఇబ్బందులు అనేవి సహజంగానే ఉంటాయి. పబ్లీసిటీ సరిగ్గా ఇవ్వకపోవచ్చు.. స్వంత ప్రాజెక్టయితే అన్నీ మనం అనుకున్నట్లు చేయవచ్చు కదా... నాకు ప్రొడక్షన్ అంటే ఇష్టం. కెమెరా ఆన్ అయితే నటుడిగా మారుతాను.. కెమెరా ఆఫ్ అయితే నిర్మాతగా మారుతాను.

పౌరుడు చిత్రం యాక్షన్ నేపథ్యంలో సాగుతుందా..?
గౌరి, సత్యం, మహానంది వంటి యాక్షన్ చిత్రాల్లో ఉన్న పవర్ ఇందులోను ఉంటుంది. అయితే ఇందులో యాక్షన్‌తో పాటు వైవిధ్యం కూడా ఉండటం గమనార్హం. అంతే సహజంగా సన్నివేశాలుంటాయి. అలాగే నా చిత్రాల్లో ఇదొక కొత్త చిత్రమవుతుంది.

అసలు పౌరుడు ఏం చేయాలనుకుంటాడు...?
సంఘంలో ఉన్నత స్థానాన్ని పొంది ప్రజలకు సేవ చేయాలనుకుంటాడు. కాని అతని చుట్టు పరిస్థితులు పౌరుడిని ఉన్నత స్థానానికి చేర్చాయా.. లేదా..? అన్నదే మూల కథ..

గోదావరి లాంటి చిత్రాలు ద్వారా క్లాస్ హీరోగా ఉండిపోవచ్చుగా..?
కరెక్టే.. అయితే .. ఒక నటుడు స్టార్ అవ్వాలనుకుంటే.. తప్పని సరిగా మాస్ ముద్ర పడితీరాల్సిందే. అయితే నాకు నచ్చేవి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు.. కాని ఒక్కోసారి అది కరెక్ట కాదనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మహిళా అభిమానులు గోదావరి లాంటి చిత్రాలు చేయమంటారు.. అయితే మగాళ్లయితే సత్యం లాంటి సినిమాలు చేయమంటున్నారు. అందరిని మెప్పించాలంటే అన్నీ ఉన్న సినిమా చేయాల్సిందే..

సంక్రాంతికి చాలా చిత్రాలు రిలీజ్ అవుతుండగా.. మీ చిత్రం ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు...?
ఎస్.. నాలుగు చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతున్నాయి. అన్నీ వైవిధ్య చిత్రాలే.. అలాగే మనకు సంక్రాంతి పెద్ద పండుగ.. సో.. అన్నీ చిత్రాలు అడగలవని భావిస్తున్నాను.

ఇద్దరు వారసులు మీ వంశం నుంచి చిత్ర సీమకు రానున్నారని విన్నాం.. దీనిపై మీ ఫీలింగ్..?
అందులో తప్పేముందు. చిత్ర సీమలో అందరికీ చోటుంది. ఎంతమందైనా రావచ్చు.. అందుకు ఎవరి అభ్యంతరమూ ఉండదు..
మరిన్ని
అగ్రహీరోలే నాకు స్ఫూర్తి: శివాజి
వైవిధ్యమైన పాత్రలే ముఖ్యం: ఆలీ
టీవీ సీరియల్స్‌లో నటిస్తే తప్పా..?: నాగార్జున
స్క్రిప్ట్ ఉంటే మల్టీ స్టారర్ చిత్రాలకు సిద్ధమే: విక్టరీ
దేవుడిచ్చిన ఈ జీవితం విలువైంది: ముమైత్‌ఖాన్
ఎంత మంది వచ్చినా నాకు పోటీ లేదు: గజాలా