ప్రధాన పేజి   వినోదం > వెండితెర > ముఖాముఖి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాత్రపై పవిత్ర భావనతో ఉండేవాళ్లం: అంజలీదేవి
Anjalidevi
WD PhotoWD
అమ్మ పాత్రల్లో, దేవత పాత్రల్లో, ప్రేయసి పాత్రల్లో, మనసు ద్రవించే పాత్రల్లోను సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్ధిర స్థానం ఏర్పరుచుకున్న నటీమణి అంజలీదేవి. అప్పటి చిత్రాల్లో తనదైన ముద్రవేశారామె.

అనార్కలి చిత్రంలో అద్వితీయమైన పాత్రలో తన నటనతో ఆ పాత్రకే జీవం పోశారు అంజలీదేవి. అనార్కలి చిత్రానికి సంగీతం పెద్ద ఎస్సెట్ అంటారు. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకులు, సంగీతం కూడా ఆమె భర్త పి ఆదినారాయణరావు.

తన చిత్ర సీమ కెరీర్‌లో ఎన్నో అవార్డులను కైవసం చేసుకున్న ఈమె తాజాగా 2007 అక్కినేని అంతర్జాతీయ పురస్కారానికి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ అవార్డును తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చిన అంజలీదేవి పురస్కారాన్ని అందుకున్న అనంతరం ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ

ఈ పురస్కారాన్ని అందుకున్న తర్వాత మీకేమనిపిస్తోంది..?
చలన చిత్ర జీవితంలో ఎన్నో అవార్డులను అందుకున్నాను. అంతర్జాతీయ స్థాయి గల ఈ అవార్డు దేవానంద్ అంతటి వారికి దక్కిన తర్వాత శేష జీవితంలో నాకు దక్కడం సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనిపై ఇప్పటికే చాలా మంది ఫోన్ల ద్వారా అభినందనలు తెలిపారు.

చలన చిత్ర రంగంలోకి ఎలా అడుగు పెట్టారు..?
నా చిన్న తనంలో డ్రామాలు వేసేదాన్ని. అప్పటికే నా భర్త ఆదినారాయణగారితో పరిచయముంది. ఇదిలా ఉండగా ఓ సారి స్ట్రీట్ సింగర్స్ అనే డ్రామా వేస్తుంటే సి పుల్లయ్యగారు నన్ను చూశారు. నా భర్త, పుల్లయ్యగారు కాకినాడలో క్లాస్‌మేట్స్ కావటంతో ఇంకేముంది.. ఆ అమ్మాయి బాగా చేసింది.. నా సినిమాలో ఓ పాత్ర ఉంది చేస్తుందా అని అడిగారట.. ఆ విధంగా నేను జనవరి 13 భోగి పండుగ రోజు మద్రాసులో అడుగు పెట్టాను.

ఆదిలోనే హంసపాదు అన్నట్లు అందరు నన్ను చూడగానే చిన్న పిల్ల ఏం చేస్తుంది అని పెదవి విరిచారు. ఒక్కసారిగా నాకు భయం వేసింది. అయితే పుల్లయ్యగారు మాత్రం నాకు ధైర్యం చెప్పారు. అందులోను నాకు అప్పటికే డ్రామాల్లో నటించిన అలవాటు ఉండడంతో పదిమంది ముందు నటించడం బెరుకు అనిపించలేదు.

మొదటి సన్నివేశంలో నటించేప్పుడు తొలి షాట్‌కే ఓకే చెప్పారు. అంతేకాక అందరూ నన్ను మెచ్చుకున్నారు. ఆ తర్వాత తమిళ నిర్మాతల ఆఫర్లు వచ్చాయి. అలాగే తెలుగులోను వచ్చాను.
  1 | 2  >> 
మరిన్ని
స్టార్ కావాలంటే మాస్ ముద్ర పడాల్సిందే: సుమంత్
అగ్రహీరోలే నాకు స్ఫూర్తి: శివాజి
వైవిధ్యమైన పాత్రలే ముఖ్యం: ఆలీ
టీవీ సీరియల్స్‌లో నటిస్తే తప్పా..?: నాగార్జున
స్క్రిప్ట్ ఉంటే మల్టీ స్టారర్ చిత్రాలకు సిద్ధమే: విక్టరీ
దేవుడిచ్చిన ఈ జీవితం విలువైంది: ముమైత్‌ఖాన్