ప్రధాన పేజి   వినోదం > వెండితెర > ముఖాముఖి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"పరుగు" చిత్రానికి అభినందనలు స్వీకరిస్తా: 'దిల్' రాజు
FileFILE
నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రాజు.. ఆ తర్వాత నిర్మాణ రంగంలో ప్రవేశించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. "దిల్" చిత్రం తర్వాత తన పేరును 'దిల్' రాజుగా మార్చుకున్నారు. కొత్త దర్శకులకు అవకాశాలు కల్పిస్తూ.. వారి ప్రతిభను ప్రోత్సహించడంలో ముందువరుసలో వున్నారు. 'బొమ్మరిల్లు' చిత్రంతో భాస్కర్‌ను, 'ఆర్య'తో సుకుమార్‌ను తెలుగు వెండి తెరకు దర్శకులుగా పరిచయం చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో "పరుగు" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసందర్భంగా 'వెబ్‌దునియా తెలుగు' ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలు...

ప్రశ్న: భాస్కర్‌నే పెట్టడానికి కారణం?
"మున్నా" చిత్రం షూటింగ్ జరుగుతుండగా ఓ రోజు అనుకోకుండా భాస్కర్‌ కలిశాడు. సరదాగా కబుర్లు చెబుతుండగా ఓ కథ ఉందని ఓ మాట అని దాన్ని గడగడా చెప్పేశాడు. దాంతో ఆ కథలో కొన్ని సన్నివేశాలు బాగా నచ్చాయి. 'బొమ్మరిల్లు' కూడా ఇలానే చెప్పినపుడు సెకండాఫ్‌ను కొద్దిగా మార్చమని చెప్పాను. లైన్ బాగుంటే ఎలాగైనా ఛేంజ్ చేయవచ్చు.

ప్రశ్న: తొలుత ఈ చిత్రానికి సుకుమార్‌ను అనుకున్నట్టు వార్తలు వచ్చాయి కదా?
సుకుమార్‌తో చేయాలనుకున్నాం. కానీ కథ ఇదికాదు. వేరే కథ. ఇది నచ్చడంతో ముందుగా దీన్ని స్టార్ట్ చేశాం.

ప్రశ్న: ఈ చిత్రానికి ముందు రకరకాల టైటిల్స్ అనుకున్నారు కదా? చివరకు "పరుగు" అనే టైటిల్‌ను పెట్టడానికి కారణం?
ఒక కోణంలో చూస్తే ఈ కథకు 'ప్రేమికుడు', 'వారధి' సరిపోతాయి. కానీ ఇవేవి ఎఫెక్టుగా ఉండవని 'పరుగు' నిర్ణయించాం.

ప్రశ్న: దేనికోసం 'పరుగు'?
ప్రతి మనిషి జీవితంలో 'పరుగు' అనేది తప్పనిసరి. బాల్యంలో స్కూలు కోసం 'పరుగు'. యవ్వనంలో ప్రేమ కోసం 'పరుగు'. ప్రేమను గెలుచుకునేందుకు 'పరుగు'. జీవితంలో స్థిరపడే వరకు 'పరుగు'. వృద్ధాప్యంలో ఆలోచనల కోసం 'పరుగు'. ఈ చిత్ర కథ రీత్యా హీరో దేని కోసం 'పరుగు' పెట్టాడన్నది సస్పెన్స్. ఈ కథ చెప్పినపుడే తర్వాత రోజే నా పుట్టిన రోజు. కథ విని ఎంతగా అభినందించానంటే ఇది నా బర్త్‌డే గిఫ్ట్‌గా భావించాను. సో.. ఇలాంటి కథలు ప్రతి మనిషిని టచ్‌చేస్తాయని నమ్మకం.

ప్రశ్న: ఈ చిత్రానికి అవార్డు వస్తుందనే అనుకుంటున్నారా?
'బొమ్మరిల్లు' చిత్రానికి షూటింగ్ సమయంలో అలా అనుకున్నాం. కానీ ఏడు అవార్డులు వస్తాయని మాత్రం అనుకోలేదు. దీంతో నా చిత్రాలపై నాకే నమ్మకం పెరిగింది. అలాగే 'పరుగు' చిత్రానికి కూడా ఇలాంటి అభినందనలే వస్తాయనే నమ్మకం మాత్రం వుంది. ఎలాంటి అభినందనలు అనేవి చెప్పలేను.

ప్రశ్న: తదుపరి చిత్రం?
'కొత్త బంగారులోకం' చిత్రం. శ్రీవాస్ దర్శకత్వంలో చేస్తున్నాను. 'హ్యపీడేస్‌'లోని ఒకరు హీరోగా నటిస్తారు. 'పరుగు' తర్వాత ఆ చిత్రంపై దృష్టిపెడతాను.
మరిన్ని
కాలేజీకి చీరకట్టుకుని వెళ్తారా:..?! జెనీలియా
"నంది" వెనుక సమిష్టి కృషి: యువసామ్రాట్
పాత్రపై పవిత్ర భావనతో ఉండేవాళ్లం: అంజలీదేవి
స్టార్ కావాలంటే మాస్ ముద్ర పడాల్సిందే: సుమంత్
అగ్రహీరోలే నాకు స్ఫూర్తి: శివాజి
వైవిధ్యమైన పాత్రలే ముఖ్యం: ఆలీ