ప్రధాన పేజి   వినోదం > వెండితెర > ముఖాముఖి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మాస్ చిత్రాల్లో నటిస్తేనే నిలబడగలం: శ్రీకాంత్
Srikanth
FileFILE
క్యారెక్టర్ విలన్ పాత్రల నుంచి హీరోగా ఎదిగిన శ్రీకాంత్ కుటుంబకథా చిత్రాలతో పాటు మాస్ చిత్రాల్లో నటిస్తేనే నాలుగు కాలాల పాటు ఇండస్ట్రీలో నిలుస్తామంటున్నారు. తాను చేసిన ఖడ్గం నుంచి ఆపరేషన్ దుర్యోధన వరకు అన్నీ వైవిధ్యమైన పాత్రలేనని తాజాగా నగరంలోను మాస్‌మెచ్చే చిత్రమని అంటున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ చెప్పిన సంగతులు..

'నగరం' అనే పేరు పెట్టడానికి కారణం..?
అరణ్యంలో జంతువులుంటాయి. జనారణ్యంలో మనుషులుంటారు. జనారణ్యం ఎక్కువుండేది నగరం. ఇక్కడ ఎవరైనా బతకవచ్చు. దానికోసం నలుగురిని హింసించి జంతువులా కాకుండా నలుగురిలో ఒకడిలా బతకాలని చెప్పేదే చిత్రం. నగరం అంటే ఎలా ఉండాలి? దానికి ఎవరి బాధ్యత ఎంతుంది? అని చెప్పేదే ఈ కథ గనుక దీనికి నగరం అనే పేరు పెట్టాం. ఇది 'తలైనగరం' అనే తమిళ చిత్రం ఆధారంగా కాస్త మార్చి తెలుగులో రీమేక్ చేశాం.

'నగరం'లో మీరేం చేస్తుంటారు..?
బాస్ చెప్పిన పనులు చేయడమే. మంచీ చెడూ అనే ఆలోచన ఉండదు. డబ్బు కోసం ఏదైనా చేస్తుంటాను. విలన్‌కు కుజడిభుజంగా ఉంటూ అతను చెప్పింది చేస్తుంటాను. దందాలు, హత్యలు చేస్తూ రౌడీగా చలామణి అవుతాను. ఒక స్టేజ్‌కు వచ్చాక ఇదంతా తప్పని తెలుసుకుని మారిపోవడానికి ప్రయత్నిస్తాను. కానీ పోలీసులు మారనీయరు. అదే సినిమా.

ప్రజలను రక్షించేవారే మారనీయకపోవడానికి కారణం..?
ఇదంతా చెప్పాలంటే.. ఒక డైలాగ్ చెబుతాను. పోలీసు అధికారి కళాభవన్‌మణి ఓ డైలాగ్ అంటాడు. రౌడీలంతా మంచివాళ్లయితే మాలాంటి వారి గతి ఏమిటని..? మాకెన్నో కోరికలుంటాయి. అవన్నీ నెలజీతాలతో సాధ్యం కాదు. మీలాంటి వారి వల్లే మేమెన్నో ఆస్తులు సంపాదించుకున్నాం. మా అవసరాలు పెరిగాయి. ఇవన్నీ సమకూరాలంటే నువ్వు రౌడీగా ఉండాలి. అంటాడు. క్లుప్తంగా ఇదే చెప్పగలను.

మరి పోలీసు వ్యవస్థను ఎత్తిచూపినట్లుంది కదా..? సెన్సార్ ఇబ్బందులు తలెత్తలేదా..?
మీకు పూర్తి డైలాగ్ చెప్పలేదు. ఏ సినిమాలో చూసినా ఎవరినో ఒకరిని విమర్శిస్తుంటారు. అది సినిమా వరకే. దానికి ముగింపు చివరలో ఉంటుంది. మొదట్లో కొన్ని డైలాగ్స్ వల్ల సెన్సార్ ఇబ్బంది కలుగుతుందనుకున్నాం. కానీ అవి రాకుండా దర్శకుడు సీసీ జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఈ తరహా చిత్రాలు చాలా వచ్చాయి. ఇందులోని ప్రత్యేకత ఏమిటి..?
కథకంటే కథనం కీలకం ఇందులో. స్క్రీన్‌ప్లేలో కొత్త దనం కనిపిస్తుంది. కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం రూపొందింది.

మనీషా కోయిరాలా చేత సాంగ్ చేయించడానికి కారణం..?
కథ విని ఆమెకు నచ్చాకే అంగీకరించింది. పైడా నిర్మాత ఆమె అభిమాని. అది కూడా ఒక కారణం.
1 | 2  >>  
మరిన్ని
"పరుగు" చిత్రానికి అభినందనలు స్వీకరిస్తా: 'దిల్' రాజు
కాలేజీకి చీరకట్టుకుని వెళ్తారా:..?! జెనీలియా
"నంది" వెనుక సమిష్టి కృషి: యువసామ్రాట్
పాత్రపై పవిత్ర భావనతో ఉండేవాళ్లం: అంజలీదేవి
స్టార్ కావాలంటే మాస్ ముద్ర పడాల్సిందే: సుమంత్
అగ్రహీరోలే నాకు స్ఫూర్తి: శివాజి