1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ముఖాముఖి

సంతోషమే నా గ్లామర్ రహస్యం: సిమ్రాన్

సామాన్యంగా చిత్ర పరిశ్రమలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే వారికి అక్క
FileFILE
సామాన్యంగా చిత్ర పరిశ్రమలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే వారికి అక్క, వదిన, అమ్మమ్మ, ఆంటీ వంటి పాత్రలు లభిస్తాయి. సిమ్రాన్ మాత్రం ఇందుకు అతీతం. ఆమె వివాహ జీవితానంతరం అమ్మగా మారిపోయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. యువరత్న "ఒక్కమగాడు" చిత్రంలో పాత గెటప్‌లో నటించినా.. "జాన్ అప్పారావు 40 ప్లస్" చిత్రంలో మాత్రం ఏకంగా హీరోయిన్‌గా నటించింది. ఈ నేపథ్యంలో.. ఆమె తెలుగు "వెబ్‌దునియా"కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీ కోసం...

ప్ర: తెలుగులో ఎందరో అగ్రహీరోలతో నటించిన అనుభవం మీ సొంతం. మరి వారి నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు.?
నా కెరీర్ ఆదిలోనే అగ్రహీరోలతో నటించే అవకాశం దక్కడం అదృష్టం. ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమలో ఉంటున్న వారు. వారి నుంచి చాలానే నేర్చుకున్నాను. ముఖ్యంగా.. వృత్తిని ఎంతగా ప్రేమించాలో గ్రహించాను. శ్రమిస్తేనే మంచి భవిష్యత్ ఉంటుందనే సత్యాన్ని గమనించాను.

ప్ర: జాన్ అప్పారావు చిత్రంలో కమెడియన్‌ సరసన జోడీగా నటించడానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
నేనెప్పుడూ స్టార్ ఇమేజ్‌ను గురించి ఎక్కువగా ఆలోచించను. నా వరకూ కథకే ప్రాధాన్యత. ఈ క్రమంలోనే జాన్ అప్పారావు స్క్రిప్టు బాగా నచ్చి నటించడానికి అంగీకరించాను.

ప్ర: వివాహం తర్వాత పేరు ప్రఖ్యాతలు దూరమయ్యాయని ఎపుడైనా బాధపడ్డారా?
లేదు లేదు.. నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను. సగటు భారతీయ మహిళలా, ఒక ఇల్లాలిలా, తల్లిగా సంపూర్ణ జీవితాన్ని అస్వాదించాలనుకునే నటనకు దూరమయ్యాను.

ప్ర: సాధారణంగా పెళ్లి తర్వాత చాలా మంది దూరంగా ఉంటారు. మీరు..?
నిజమే. కానీ అది వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి ఉంటుంది. నాకు నటన తప్ప మరొకటి తెలియదు. నటన నా ప్రాణం. ఇందుకు నా భర్త సహకారం అందుతోంది. ప్రేక్షకులూ ఆదరిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి నాకు.

ప్ర: దశాబ్దం క్రితం టాలీవుడ్‌కీ ఇప్పటికీ తేడా ఏమైనా గమినించారా?
వర్థమాన దర్శకులు క్రమశిక్షణతో తమదైన శైలిలో చిత్రాలు తీస్తున్నారు. గతంలో వినోదాత్మకంగా మాత్రమే చిత్రాలు తెరకెక్కేవి. నేటి యువ దర్శకులు మాటలు రాస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతున్నారు.

ప్ర: ఇంతకీ మీ గ్లామర్ రహస్యం?
ఏముందండీ.. సంతోషంగా ఉంటే అందంగా ఉంటాం. అదే నా గ్లామర్ రహస్యం. జీవితాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి. నా జీవితంలో ఎలాంటి టెన్షన్స్‌లేవు. బిడ్డకు తల్లిగా ఆనందమయ జీవితాన్ని గడుపుతున్నాను.
About Writer
PNR