గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » గుజరాతీ ముద్దుగుమ్మ 'ఫర్జానా'తో ముచ్చట్లు
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
'భాగ్యలక్ష్మీ బంఫర్ డ్రా' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గుజరాతీ ముద్దుగుమ్మ ఫర్జానా ఆపై తెలుగులో ఓ రెండు చిత్రాలు చేసింది. ప్రస్తుతం తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఫర్జానా అక్కడ స్టార్ ఇమేజ్ ఉన్న శరత్‌కుమార్ సరసన '1977' అనే చిత్రంలో నటిస్తోంది.

తెలుగు పరిశ్రమతో పాటు తమిళ పరిశ్రమ సైతం తనకు నచ్చిందని చెబుతున్న ఫర్జానాతో కాసేపు మాటామంతి...

1977 చిత్రంలో నటిస్తున్న సమయంలో శరత్‌కుమార్ నుంచి మీరు ఏమి గ్రహించారు?
ఆయన చాలా సిల్వర్ జూబ్లీ చిత్రాల్లో నటించారు. అలాగే మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా. రాజకీయాలు, సినిమాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఆయన కొన్ని ఉదాహరణలతో నాకు వివరించారు. మనం చేసే పనిమీద శ్రద్ధ పెడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఆయన నాకు సలహా ఇచ్చారు.

శరత్‌కుమార్‌తో నటిస్తున్న చిత్రంలో నేను జర్నలిస్ట్ పాత్ర పోషిస్తున్నాను. జర్నలిజం గురించి షూటింగ్ సమయంలో నాకు తెలిసింది. నిజంగా జర్నలిజం అనేది సాహసమే.

నటనలో అనుభవంలేని మీరు ఈ రంగంలోకి ఎలా ప్రవేశించారు?
నేను పలు యాడ్స్‌లో నటించాను. ఎల్.జి. ఫోన్స్, కొన్ని జ్యూయెలర్స్ యాడ్స్ చేశాను. అందులో భాగంగా ఓ ఫ్యాషన్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చాను. అక్కడికి వచ్చిన దర్శకుడు నిధిప్రసాద్ తన సినిమా గురించి చెప్పారు.

మరుసటిరోజు వారి ఆఫీసుకు వెళ్లాను. ఫోటోసెషన్ చేశాక ఆ చిత్రంలో నన్ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అలా భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా చిత్రంతో నటినయ్యాను.

గ్లామర్‌పై మీ అభిప్రాయం?
నేను తెలుగులో చేసినవన్నీ కామెడీ చిత్రాలే. అందులో అన్నీ హోమ్లీ పాత్రలే. పాటల్లో మాత్రం గ్లామర్‌గా నటించాను. సీమశాస్త్రి చిత్రంలో బాగా గ్లామర్‌గా నటించానని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే సినిమా వ్యాపారం కనుక ఆ మాత్రం చేయక తప్పదు.

ఎటువంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?
ఫెరోషియస్ పాత్రలంటే ఇష్టం. విజయశాంతి తరహా యాక్షన్ పాత్రలు చేయాలని ఉంది. నేను డాన్స్‌నే కాక మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంటున్నాను.

 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: గుజరాతీ ముద్దుగుమ్మ ఫర్జానా ముచ్చట్లు