గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ముఖాముఖి » 'ప్రేమనగర్' నిర్మాత 'రామానాయుడు'తో మాటా మంతీ
ముఖాముఖి
Feedback Print Bookmark and Share
 
'ప్రేమనగర్' చిత్రంతో నిర్మాతగా గుర్తింపు సాధించిన డా. డి.రామానాయుడు తెలుగుపరిశ్రమతో సహా పలు భాషల్లో చిత్రాలు నిర్మించి గిన్నీస్ రికార్డు సైతం సాధించారు. కార్యదీక్ష, పట్టుదలే పెట్టుబడిగా ఇండస్ట్రీలో ఎదిగిన ఆయన మనోధైర్యమే ఆయనను ఇంతవాన్ని చేసింది.

జూబ్లిహిల్స్‌లో ఒకనాడు రాళ్లతో నిండిపోయిన ప్రదేశాన్ని సుందరమైన రామానాయుడు స్టూడియోగా తీర్చిదిద్దడంలో ఆయన పడ్డ శ్రమ అంతా ఇంతాకాదు. అనాడు జూబ్లిహిల్స్‌లో స్టూడియో నిర్మాణానికి చూపించిన అదే ఉత్సాహంతో ఆయన నేడు వైజాగ్‌లోనూ మరో స్టూడియో నిర్మిస్తున్నారు.

ఏడుపదుల వయసు దాటినా కుర్రాడిలా చలాకీతనం ఉట్టిపడే రామానాయుడు శుక్రవారం తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు మాటా మంతి...

కెరీర్ పరంగా వెంకటేష్‌పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
కెరీర్‌పరంగా వెంకటేష్ ఎంతో ఎదిగాడు. రోజూ పనిచేస్తే ఐదులక్షలు వస్తాయి కదా అని అంటే... ఎందుకు డాడీ మనకున్నది చాలదా అంటాడు. అదేమంటే... ఫిలాసపర్‌గా మాట్లాడుతాడు. తనకు నచ్చితేనే సినిమా చేస్తాడు.

గతంలో చంటి సినిమా చేసేటప్పుడు కూడా ఆ చిత్రం నీకు సెట్ కాదు అంటే పట్టుబట్టి చేశాడు. ఆ సినిమాతో వెంకటేశ్ వైవిధ్యమైన పాత్రలు కూడా చేయగలడనే విషయం రుజువైంది. వెంకటేష్ అన్ని రకాల పాత్రలు చేయగలడు.

వైజాగ్‌లో మీరు కడుతున్న స్టూడియో ప్రారంభం ఎప్పుడు?
వైజాగ్‌లో నిర్మించే స్టూడియో దాదాపు పూర్తి అయ్యింది. నిర్మాతకు ఇబ్బందిలేకుండా చిత్రాన్ని నిర్మించడానికి దీనిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. చాలామంది షూటింగుల కోసం అడిగినా మా అబ్బాయి చిత్రంతో మొదలు పెట్టాలని ఆపాను. ఆగస్టులో సిఎం చేతుల మీదుగా ఈ స్టూడియోను ప్రారంభించనున్నాం.

వైజాగ్ స్టూడియో నిర్మాణానికి చాలా కష్టపడ్డాం. అందుకే మా అబ్బాయి అంటుంటాడు జీవితమంతా రాళ్లు పగలగొట్టడానికే సరిపోయిందని. నిజమే... మా స్టూడియోలు, మా అబ్బాల కోసం కట్టిన ఇళ్లు అన్నీ కూడా రాళ్లు పగలగొట్టి నిర్మించినవే.

తండ్రిగా వెంకటేష్‌లో ఏమి గమనించారు?
వెంకటేష్ తను చేసిన చిత్రాలన్నీ సూపర్‌హిట్ కావాలని కోరుకుంటాడు. హీరోగా ఏ చిత్రానికి కమిట్ అయినా దాన్ని సొంత నిర్మాతలాగా చూసుకుంటాడు. ఎక్కడా వేస్ట్ కానివ్వడు. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న చింతకాయలరవి చిత్రం షూటింగ్ ఫారిన్‌లో జరుగుతోంది. ఆ చిత్ర యూనిట్ బాబు గురించి చెబుతోంటే ఆశ్చర్యమేస్తోంది.

ఇద్దరు కొడుకులు, కూతుళ్ళు, మనవళ్లతో అంతా సంతోషంగా ఉండడం, అంతా కలిసి ఉండడం అదే నా ఆస్తి.

 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ప్రేమనగర్ నిర్మాత 'రామానాయుడు