యువహీరోల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకోవాలనుకుని తాపత్రయపడుతున్న వ్యక్తి నితిన్. తేజ "జయం" తర్వాత మళ్ళీ అంత హిట్ కోసం ఎదురుచూస్తున్నా విజయం ఆమడదూరంలో ఉంటుంది. అయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాడు. ఏదో ప్రత్యేకతను కనబరచాలని తన బాడీని సైతం ఎక్స్‌పోజ్ చేసి 8ప్యాక్‌తో ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు...
ప్రశ్న... విక్టరీలో 8ప్యాక్ ఎంతవరకు ఉపయోగపడింది? జ... కొత్తదనంగా కన్పించాలని 8ప్యాక్ బాడీ మొట్టమొదటిసారిగా ప్రయత్నించాను. అది యూత్‌ను ఆకట్టుకుంటూనే ఉంది. నేడు అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతుండటం పరిపాటి. అందులో భాగంగానే పాత్రరీత్యా అలా చూపించడం జరిగింది. కథరీత్యా ఐపీఎస్ కోసం ప్రయత్నిస్తాడు కనుక, అలా ఉంటే బాగుంటుందనే ఐడియా దర్శకుడికి వచ్చింది. దాని ప్రకారం బాడీని పెంచుకున్నారు. దీనికి తోడు బాలీవుడ్ హృతిక్‌రోషన్ స్ఫూర్తితో నా గత చిత్రాలు టక్కరి, ఆటాడిస్తా చిత్రాలకంటే కొత్తగా కన్పించాలని బాడీని పెంచాను.