నాటి విజయలలితకు నేటి ముమైత్‌ఖాన్‌కు కొన్ని తేడాలు కనిపిస్తాయి. వెండితెరపై విజయలలిత కన్పిస్తే ప్రేక్షకుల్లో భలే హుషారు. అదేవిధంగా నేడు ముమైత్‌ఖాన్ చూస్తుంటే ప్రేక్షకుల్లో అదేపరిస్థితి గోచరిస్తోంది. "మైసమ్మ ఐపీఎస్" వంటి సినిమాల్లో శరీరం గగుర్పాటు చెందే భీకర పోరాటాలను అలవోకగా నటించి తన సత్తాను నిరూపించుకుందీ ముంబై భామ. క్లబ్ డాన్సులు, జానపద నృత్యాల్లో ఆమె చేస్తూనే కళ్ళలో కసి, కైపు చూపటంలో ఆమెకు ఆమే సాటి.
కేవలం నటిగానే కాకుండా హీరోయిన్ స్థాయికి ఎదిగి, నిర్మాతగా కూడా విజయలలిత పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముమైత్‌ఖాన్ కూడా నర్తకిగానే కాకుండా పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా కూడా "ఎవడైతే నాకేంటి" చిత్రంలో నటించి, "మైసమ్మ"లో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.
కెమెరా అంటే భయంలేదుగానీ, గ్యాసిప్స్ అంటే భయమని అంటోంది ఈ అందాల భామ ముమైత్. అందుకే వాటికి దూరంగా ఉండాలంటే తెలుగులో మరో చిత్రాలు నటించి ముంబైకి మకాం మార్చేస్తానటోంది. ప్రస్తుతం ఆమె "టార్గెట్" అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా ఆమెతో కాసేపు...
ప్రశ్న... సినిమాలో మీకున్న "టార్గెట్" ఏమిటి? జ...ఇందులో ప్రధాన పాత్ర నాదే. నవలా రచయితగా నటిస్తున్నాను. ఆమెకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాననే "టార్గెట్"కు శివబాలజీ తోడవుతాడు. అది ఏవిధంగా అనేది సస్పెన్స్.
ప్రశ్న...హీరోయిన్‌గా కూడా మంచి ఇమేజ్‌ఉన్న మీరు షరాస్టోన్‌లా ఎక్స్‌పోజింగ్ చేయడానికి కారణం? జ... వైవిధ్యం కోసమే. బేసిక్ ఇన్‌స్టెంట్‌లో షరానాస్టోలా చేశానా, లేదా అనేది చిత్రంలో చూస్తేనే తెలుస్తుంది. అయినా చేయడంలో తప్పులేదని నా అభిప్రాయం. నా కంటూ ఒక ఆడియన్స్ ఉన్నారు. వారి కోసమైనా వైవిధ్యంగా నటించాలి.
ప్రశ్న...దక్షిణాది పరిశ్రమ ఎలా అనిస్తుంది? జ... సౌత్‌లో చిత్రాలు చేస్తున్నాను. కాబట్టి కమ్‌ఫర్‌టబుల్‌గా ఉందని చెప్పాల్సి వస్తుంది.
ప్రశ్న...అంటే సంతోషంగా లేరనేగా మీ ఉద్దేశ్యం...? జ.. ఖచ్చితంగా లేను. సినిమాలు కూడా ఎక్కువగా ఒప్పుకోవటం లేదు. మూడు చిత్రాల్లోకమిట్ అయ్యాను. అవి పూర్తయ్యాక త్వరలో ముంబైకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను.
ప్రశ్న...అంతలా నిర్ణయం తీసుకోవడానికి కారణం? జ... ఇక్కడంతా బ్యాడ్ థింక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నా గురించి చాలా వెబ్‌సైట్లు రకరకాలుగా కథలు అల్లుతున్నాయి. పలానా వ్యక్తితో ఇలా ప్రవర్తిస్తుంది. వేరే దర్శకుడితో మరోలా ఉంటుంది. షూటింగ్‌కు సకాలంలో హాజరు కాదు. ఇలా... రకరకాల కథనాలు ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. వాటిని నా మొహంమీద చాలా మంది అడిగేస్తున్నారు. ఆ వార్తలు నా కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. నా కుటుంబానికి మనస్థాపం కలిగిస్తుంది. అందుకే ఎంత త్వరగా వెళ్ళితే అంత మంచిదని అనిపిస్తుంది.
ప్రశ్న... అక్కడ కూడా ఇలాంటివి ఉంటాయి కదా? జ... అక్కడ ఉన్నా అవి పరిమితమే. నా స్వంత ప్లేస్ కాబట్టి నేను ఎంజాయ్ చేస్తాను. అయినా అక్కడ ఇవి పెద్దగా పట్టించుకోరు.
ప్రశ్న... ముంబై నుంచి చాలా మంది వస్తున్నారు. మీకు పోటీ అని ఎప్పుడైనా భావించరా? జ.. ఎప్పుడూ భావించలేదు. అసలు అలాంటివి నేను పట్టించుకోను.
ప్రశ్న.. పెళ్ళిపై మీ ఆలోచన? జ... ఇప్పుడప్పుడేకాదు. ఇంకా ఐదు సంవత్సరాల తర్వాతే.
ప్రశ్న... ఎలాంటి వ్యక్తిని కావాలనుకుంటున్నారు? జ... నన్ను అర్థం చేసుకునేవాడు. ముఖ్యంగా ఇలాంటి గ్యాసిప్స్ వచ్చినా పట్టించుకోని వ్యక్తి.