ప్రశ్న... వంటలో ప్రావీణ్యం ఉందా? జ... చికెన్, మటన్ చేయడం బాగా నేర్చుకున్నా.
ప్రశ్న... అంటే మీరు పక్కా మాంసాహారులా? జ... ఒకప్పుడు... గత రెండేళ్ళలో నాలో తెలీకుండా మార్పు వచ్చింది. శాఖాహారమే తింటున్నాను.
ప్రశ్న... దీనికేమైనా కారణముందా? జ... ఓసారి కారులో ప్రయాణిస్తుంటే.. కొంతమంది గుంపులుగా ఉన్న మేకల్ని పట్టుకోవడం చూశాను. ఎందుకంటే.. బలికోసమని చెప్పారు. దాంతో తెలీని మార్పు కల్గింది. దానికి నోరులేదు... చంపొద్దు అని అరవలేదు. ఇది తప్పని తెలిసింది. సహజంగా నాకు కుక్కలు, పిల్లులంటే చాలా ఇష్టం. వాటికి ఏ మాత్రం అనారోగ్యం కల్గినా వెంటనే ఆసుపత్రికి తీసుకెళతాను.
ప్రశ్న... అంటే ఇక్కడ అమలగారు చేస్తున్న తరహాలోనా? జ... అవునండి... మొట్టమొదటిగా హైదరాబాద్ వచ్చినప్పుడు అమల-నాగార్జునను కలిశాను. చాలా విషయాలను షేర్ చేసుకున్నాం. ఆమె భావాలు చాలా నచ్చాయి.
ప్రశ్న... అమలగారులా మీరు కూడా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయవచ్చుకదా? జ... చేయాలనే ఉంది.. చెప్పాలంటే.. నాకొక పేరు, హోదా ఉంటేనే వింటారు. అందుకోసం డబ్బు సంపాదించాలి. ఆ తర్వాతే నేను చెప్పింది ఎవరైనా వింటారు. అందుకే అన్నీ సమకూరాక జంతువుల కోసం ఆసుపత్రి నిర్మించాలనుంది. మనుషుల్ని ఎలా అభిమానిస్తానో మూగజీవాలకు కూడా అలానే ప్రేమను పంచుతాను. మానవత్వమే జీవితం. అందరినీ ప్రేమించడమే పరమార్థం. దేవుడి దృష్టిలో అంతా సమానమే.
ప్రశ్న... పెళ్ళిపై మీ అభిప్రాయం? జ... పెళ్ళి అనేది పవిత్రమైంది. నాకింకా ఆ వయస్సు రాలేదు. ఇంకా పదేళ్ల తర్వాతే ఆలోచిస్తా.
ప్రశ్న... ఎలాంటి వ్యక్తిని కోరుకుంటారు.? జ.. పెళ్ళి అనేది మన సంస్కృతి. దానికి గౌరవం ఇవ్వాలి. అలాంటి వ్యక్తినే చేసుకుంటా. ముఖ్యంగా అమ్మా, నాన్నలను గౌరవంగా చూడాలి. నా ఆలోచనలకు తగ్గట్లు వ్యవహరించాలి. ప్రధానంగా జంతుప్రేమ కలిగినవాడై ఉండాలి. నేను చేసినట్లే మూగజీవులకు సేవచేసిన వాడైతేనే చేసుకుంటా.
ప్రశ్న... ఎక్స్‌పోజింగ్ చేయమంటే ఏం చేస్తారు..? జ.. నేను చేయను. ఎక్స్‌పోజింగ్ అనేది అన్నీ చోట్లా ఉంది. ఉల్లాసంగా..లో కరుణాకరన్ చాలా ప్లసెంట్‌గా చూపించారు. అలాగే మంచు మనోజ్ చిత్రంలోనూ డీసెంట్‌గా చేశాను. ఈ తరహాలోనే మెయింటెయిన్ చేస్తాను. డబ్బుకోసమో, కెరీర్ కోసమో నా పాలసీ మార్చుకోను. దక్షిణాది వారు కేవలం ఎక్స్‌పోజింగ్ చూపిస్తేనే చూస్తారని ఏ మాత్రం అనుకోను.