కొద్దినెలల క్రితం బ్రెట్‌లీ, ఊర్మిళా మంటోడ్కర్ సంజయ్‌దత్‌లతో కలిసి ఆశాభోస్లే పాడినప్పుడు విజేతగా ఆమే నిలిచారు. అదే ఆశా మరియు స్నేహితులు ప్రోగ్రాంగా పేరు పొందింది.. స్నేహితులను సంపాదించుకోవడంలో ఆమెకు అడ్డేలేదు మరి. ఈ సారి తనతో కలిసి పాడేందుకు మరి కొందరికి ఆశా అవకాశం ఇచ్చారు. 75 సంవత్సరాల వయస్సులో కూడా ఆశాభోస్లే విశ్రాంతి కోరుకోవడం లేదు. ఇన్నేళ్లుగా తమ సంగీత ప్రస్థానం గురించి ఆమె టిడబ్ల్యుఎఫ్ కరస్పాండెంట్‌తో పంచుకున్నారు.
ఈ వయసులోనూ ఇంత శక్తి మీకు ఎక్కడినుంచి వస్తోంది? హహ్హహ్హహ్హ..... నేను చనిపోయేంతవరకూ ఇలాగే ఉండాలని నా కోరిక. నేను యవ్వనంలోనే ఉన్నాను అని మనసారా ఫీల్ కావడంలోనే నా విజయ రహస్యం ఉంది మరి. జీవితాన్ని నేను ఆస్వాదిస్తున్నాను కాబట్టి జీవితం చివరి క్షణం వరకూ నేను నాపని చేస్తూనే ఉంటాను.
మీరంటున్నది పాడటం గురించేనా? అవును. అంతకు మించి ఏముంటుంది. సంగీతమే నా సర్వస్వం, దాంతోనే జీవిస్తాను దాంతోనే మరణిస్తాను. అందుకే మీరు ఆశా మరియు స్నేహితుల గురించి ఆలోచిస్తుంటారా?
అవును. అదొక ప్రేమైక అనుభవం.... ప్రత్యేకించి బ్రెట్‌లీతో.. సంజయ్‌దత్‌తో కూడా ఇంతే మరి. సంజయ్ ఎంత నమ్రత గల వ్యక్తో మరి. పైగా వీళ్లంతా నన్ను అభిమానిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆశా మరియు స్నేహితులు 3వ భాగం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మరి.
వావ్.. ఎంత గొప్ప ఆలోచన.... అవును అతి త్వరలోనే ఇది పూర్తవుతుంది. మిథున్ చక్రవర్తి ఇప్పటికే తన వెర్షన్ రికార్డ్ చేశారు అలాగే అనిల్ కపూర్ కూడా.. వాళ్లిద్దరూ పాడుతున్నప్పుడు ఉద్వేగానికి గురయ్యారు.
వారు స్వతహాగా భావోద్వేగపరులు మరి... అవును. వారు భావోద్వేగపరులే ఇరువురూ చక్కగా పాడారు. వాళ్లు మంచి గాయకులు కూడా..
ఈ కార్యక్రమంలో పాడగల వ్యక్తులను మీరు ఎలా కనిపెట్టగలిగారు.. మరోలో అడగాలంటే వాళ్లే మీ వద్దకు వచ్చి ఈ విషయమై సంప్రదించారా? అహ.. నేనే తెలుసుకున్నాను.. వాళ్లు మంచి గాయకులు. పైగా వారు నన్నెంతో గౌరవించారు. వీరిలో ఎవరు మంచి గాయకులో కనుక్కున్న తర్వాతే నేను రికార్డింగ్‌కు పోయాను.