Charmi| Swiming| Krishna Vamsi| Glamour| Mantra | స్విమ్మింగ్ ఎక్కువగా చేస్తా: ఛార్మి
తెలుగు సినిమాలో పరిచయమైన కొద్దిరోజుల్లోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ పాత్రలను చేసి ప్రేక్షకులను మెప్పించిన నటి ఛార్మి. శ్రీ ఆంజనేయం, 16డేస్, అనగనగా ఒకరోజు, మంత్ర, కావ్యాస్ డైరీ వంటి చిత్రాల్లో నటించిన ఛార్మి తాజాగా కృష్ణవంశీ చిత్రంలో నటిస్తోందన్న వార్తలు విన్పిస్తున్నాయి.
అయితే కొత్త చిత్రాలు ఇంకా ఫైనల్ కాలేదని, తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయంటోంది ఛార్మి. హైదరాబాదులో జరిగిన వాణిజ్య కార్యక్రమంలో ఛార్మి పాల్గొంది. ఈ సందర్భంగా ఛార్మి వెల్లడించిన పలు విషయాలు మీ కోసం..
ప్రశ్న.. పంజాబీ అయినా తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారే?
జ.. శ్రీ ఆంజనేయం సినిమా సమయంలో కృష్ణవంశీ తెలుగు తప్పకుండా నేర్చుకో అనేవారు. అప్పటినుంచి సీరియస్‌గా తెలుగు నేర్చుకున్నా. మాట్లాడటం మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేశా. తర్వాత రాఖీ, అనగనగా ఒకరోజు సినిమాలకు డబ్బింగ్ చెప్పుకునేంత స్థాయికి ఎదిగాను.
ప్రశ్న.. మీ అందం రహస్యమేమిటి?
జ.. ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోను. అందం అమ్మ ఇచ్చిన బహుమతి. ఆమె చాలా అందంగా ఉంటుంది. కాస్మోటిక్స్ ఎక్కువగా వాడను. పర్‌ఫ్యూమ్స్ కూడా తక్కువగానే ఉపయోగిస్తా.
ప్రశ్న.. ఆరోగ్య రహస్యాలు?
జ.. స్విమ్మింగ్ ఎక్కువగా చేస్తా. స్మిమ్మింగ్‌లో స్టేట్ ప్లేయర్ని. గ్లామర్‌గా కన్పించడానికి బాగా నిద్రపోతా. దేనికీ బాధపడను. పాజిటివుగా ఆలోచిస్తా.
ప్రశ్న.. గాసిప్స్‌ను ఎలా తీసుకుంటారు?
జ.. అంతా పాజిటివ్‌గానే. మొదట్లో చాలా బాధపడేవాళ్ళం. అమ్మనాన్నకూడా ఆ వార్తలు విని బెంబేలెత్తేవారు. తర్వాత, తర్వాత అలవాటుపడ్డాం.
ప్రశ్న.. దేవీశ్రీప్రసాద్ గురించి పలు వార్తలు వస్తున్నాయి? వాటి గురించి..?
జ.. సంగీతదర్శకుడు దేవీశ్రీప్రసాద్ నాకు మంచి మిత్రుడు. రాఖీ చిత్రంలో డాన్సు, డైలాగుల్లో బాగా సహకరించాడు. నాకు తెలుగు ఇండస్ట్రీలో స్నేహితులు ఎలా ఉన్నారో? ఆయనకు కూడా అంతే..? అయితే మీరు అనుకునే ఫ్రెండ్ మాత్రం కాదు.
ప్రశ్న.. బాగా అల్లరి చేస్తుంటారని రామానాయుడుగారే ఓ సందర్భంలో అన్నారు?
జ.. అవును. నేను చాలా అల్లరి చేస్తుంటాను. ఇంట్లో అమ్మానాన్నలతో ఎలా ఉంటానో నాయుడిగారితోనూ అలాగే ఉంటాను. అమ్మకాబట్టి భరిస్తుంది వేరేవారు భరించరు గదా. అది మానాలంటే కష్టంగా ఉంటుంది.
ప్రశ్న.. ఖాళీ సమయ్యాల్లో వ్యాపకాలేమిటి?
జ.. ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుతాను. భక్తి ప్రాధాన్యత గల పుస్తకాలంటే ఇష్టం. బోర్ కొడితే స్నేహితులతో ఛాటింగ్ చేస్తా.